November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..


విజయవాడలోని ఓ హోటల్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కి గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ హోటల్‌లో తనిఖీ చేపట్టారు

ఈ మధ్యకాలంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తాయి. మొన్నటి వరకు విమానయాన సంస్థలకు వచ్చిన బాంబు బెదిరింపులు ఇప్పటికి హోటల్స్‌కు వస్తున్నాయి. నిన్న తిరుపతిలోని ఓ హోటల్‌కి బాంబు బెదిరింపులు రాగా.. ఇటీవల విజయవాడలోని ఓ హోటల్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి

ఫేక్ మెయిల్ బెదిరింపులు..
బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కి గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ హోటల్‌లో తనిఖీ చేపట్టారు. కానీ ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదు. ఇది ఒక ఫేక్ మెయిల్ అని, ఫేక్‌గా బాంబు బెదిరింపులు చేసినట్లు పోలీసులు గుర్తించారు

ఇదిలా ఉంటే నిన్న తిరుపతిలోని హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాద సంస్థలు మెయిల్స్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. జాఫర్‌ సాదిక్‌ పేరుతో మెయిల్స్‌ వచ్చినట్లు చెప్పారు. బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన హోటల్స్ లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు సమాచారం.

తిరుపతిలోని లీలామహల్ సెంటర్‌లోని మూడు హోటల్స్‌కు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్‌ హోటల్‌ను పేల్చేస్తామంటూ  మెయిల్ ద్వారా బెదిరింపులు  పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో పోలీసులతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Also read

Related posts

Share via