ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏక్తాగుప్తా చనిపోవటంతో విమల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మూడో కంటపడకుండా శవాన్ని మాయం చేయాలి అనుకున్నాడు. జిమ్ ట్రైనర్ విమల్ సోనీ చేసిన ఈ దారుణం గత నాలుగు నెలలపాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. కాన్పూర్‌కు చెందిన ఓ మహిళ కనిపించటం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధిత మహిళ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు మొదలుపెట్టారు. మహిళ కోసం ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆమె తరచూవెళ్లే జిమ్ ట్రైనర్ మహిళను చంపి, మృతదేహాన్ని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో పూడ్చిపెట్టినట్టుగా గుర్తించారు. జిమ్ ట్రైనర్ విమల్ సోనీని పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. తమదైన స్టైల్లో అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
CCTV Video
కాన్పూర్‌కు చెందిన ఏక్తా గుప్తా అనే మహిళ కనిపించడం లేదని భర్త రాహుల్ ఫోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. ఏక్తా గుప్తాకు విమల్ అనే జిమ్ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా విచారణలో తేలినట్టుగా పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే జిమ్ ట్రైన్ విమల్ మరో మహిళతో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఏక్తా గుప్తా అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో విమల్ ఏక్తా మెడపై బలంగా కొట్టాడంతో ఆమె మరణించినట్టుగా పోలీసుల విచారణలో తేలిందని చెప్పారు. ఇక చనిపోయిన ఏక్తాగుప్తా మృతదేహాన్ని దృశ్యం సినిమా తరహాలో ఖననం చేశాడు.
ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏక్తాగుప్తా చనిపోవటంతో విమల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మూడో కంటపడకుండా శవాన్ని మాయం చేయాలి అనుకున్నాడు. పథకం ప్రకారం..శవాన్ని కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. విమల్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు మొత్తం విషయాన్ని బయటపెట్టారు. ఏక్తా గుప్తా శవాన్ని గుర్తించారు. జిమ్ ట్రైనర్ విమల్ సోనీ చేసిన ఈ దారుణం గత నాలుగు నెలలపాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు
Also Read
- TG Murder: భూ వివాదంలో తండ్రి హతం.. పగతో పెద్దమ్మను గొడ్డలితో నరికిన కొడుకు!
- Vastu Tips: అక్వేరియంలో ఎన్ని చేపలుంచాలి.. ఈ దోషాలకు వాస్తు శాస్త్రం చెప్తున్న సింపుల్ రెమిడీ..
- త్వరలోనే గజలక్ష్మి రాజ యోగం.. ఈ 3 రాశులకు ఇక ఆదాయం రెట్టింపు, సంతోషం మూడింతలు..!
- Budh Gochar 2025: రేపు మేష రాశిలో బుధాదిత్య యోగం.. ఈ రాశుల ఉద్యోగ, వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే..
- Tulasi Puja Tips: తులసి మొక్క పూజకు నియమాలున్నాయి.. ఈ రోజుల్లో పొరపాటున కూడా నీరు పోయవద్దు.. ఎదుకంటే..