కళ్యాణ మండపం నుంచి అదృశ్యమైన వధువు.. ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. అది చూసిన బంధువులు కుటుంబీకులు బిత్తర పోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కొన్ని గంటలనే పెళ్లి ఉండగా ప్రియుడితో కలిసి వధువు వెళ్లిపోయిన ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కర్నూలు జిల్లాలో కొన్ని గంటలనే పెళ్లి ఉండగా ప్రియుడితో కలిసి వధువు వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలలో పెళ్లి పెట్టుకొని పత్తికొండ గోపాల్ ప్లాజా నుండి వెళ్లిన పెళ్లి కుమార్తె పత్తికొండ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. తమ కుటుంబ సబ్యులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో కళ్యాణమండపం నుండి వెళ్లిపోయానని, పెళ్లికుమారుడితోొ తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, అందుకే తనకు నచ్చిన అబ్బాయితో వెళ్లానని ఆమె పోలీసులకు తెలిపింది.
తమ పై తండ్రి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఆమె పోలీసులను కొరింది. పోలీసులు తన తండ్రిని తీసుకొని వస్తే ఫిర్యాదు వెనుక తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని గంటలలో పెళ్లి పెట్టుకుని కల్యాణ మండపం నుండి వెళ్లిపోయిన ఆ యువతిని కొందరు తిడుతుండగా మరికొందరు జీవితాంతం ఇష్టం లేని వారితో కలిసి కాపురం చేయడం కంటే నచ్చిన వారితో ఉండడం మంచిదని అంటున్నారు.
Also read
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.





