విశాఖపట్నం…రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పాలకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు వడ్డాది ఉదయకుమార్ బుధవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సామాజి వర్గానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం శుభసూచకం అన్నారు. హిందూ సంప్రదాయాన్ని ఆగమ శాస్త్రాలు అవగాహన ఉన్న బ్రాహ్మణులు కూడా దేవాలయ పాలకవర్గంలో ఉండడం ఆ దేవాలయాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేస్తున్న రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,కూటమి ప్రభుత్వానికి ఉదయకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
