ప్రియుడి దాడిలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువతి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.
గుంటూరు: ప్రియుడి దాడిలో గాయపడి బ్రెయిన్డ్ అయిన యువతి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్‌కు చెందిన యువతి సహానా (25)ని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్, ప్రియుడు ..నవీన్ కొట్టడం వల్లే ఆమె బ్రెయిన్డ్ అయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అరెస్టు చేసిన కొన్ని గంటలకే ఆమె కన్నుమూసింది.
వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం తన పుట్టిన రోజంటూ ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లిన నవీన్ గంటల వ్యవధిలోనే అపస్మారక స్థితిలో ఆమెను తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చి యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమె బ్రెయిన్‌డెడ్ అయిందంటూ కుటుంబసభ్యులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెనాలి రెండో పట్టణ పోలీసులు నిందితుడు నవీనన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నవీన్, సహానా చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఆమె తాను పని చేస్తున్న హియరింగ్ అండ్ స్పీచ్తెరపీ కేంద్రం నిర్వాహకుల వద్ద నుంచి కొంత నగదు అప్పుగా తీసుకుని నవీన్‌కు ఇచ్చింది. అతను సమయం గడుస్తున్నా ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడం, ఇతర వ్యక్తిగత అంశాలపై ఇరువురి మధ్య మాటామాటా పెరిగిందని పోలీసులు విచారణలో తేలింది.
ఈ క్రమంలోనే శనివారం కారులో గొడవ మొదలైన నేపథ్యంలో సహానాను అతను కొట్టడంతో ఆమె తల డోర్‌కు, డ్యాష్ బోర్డుకు తగలడం వల్ల గాయాలయ్యాయి. కొంత కాలం నుంచి తలనొప్పితో ఇబ్బంది పడుతున్న యువతి ఈ దెబ్బల వల్ల మరింత బాధకు గురై కేకలు వేయటంతో భయపడిన నవీన్ ఆమెను తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చి పరారయ్యాడు. బాధితురాలు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో కోమా దశలోనే ఉండి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది
Also read
- తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే
- శని దోషాలు: శని దోషాలతో బాధ పడుతున్నారా? భయం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
- శని నక్షత్ర మార్పు: ఏప్రిల్ 17 నుంచి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. పట్టరాని అదృష్టం!
- నేటి జాతకములు..18 ఏప్రిల్, 2026
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.





