November 22, 2024
SGSTV NEWS
CrimeNational

Crime News: పుట్టింటి నుంచి రూ.కోటి తేవాలని వేధింపులు.. వైద్యురాలి ఆత్మహత్య

ఛత్రపతి శంభాజీనగర్: అత్తింటివారి వేధింపులను భరించలేని ఓ వైద్యురాలు బలవన్మరణం చెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి రూ.కోటి తీసుకురావాలంటూ ఒత్తిడి చేయడంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఎర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డాక్టర్ ప్రియాంక భుమ్రేకు బీడ్లో నివసించే నీలేశ్తో 2022లో వివాహం జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకే అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. ఆస్పత్రి పెట్టేందుకు పుట్టింటి నుంచి రూ.కోటి తేవాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేశారు. దీంతో వారి వేధింపులను భరించలేక ఆగస్టులో ప్రియాంక పోలీసులను ఆశ్రయించారు.

వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త నీలేశ్, అతడి తల్లిదండ్రులు, సోదరి, సోదరుడిపై పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాధితురాలు పాలం టౌన్లోని తన పుట్టింట్లోనే నివాసం ఉంటున్నారు. అయినా, భర్త, అతడి కుటుంబ సభ్యులు ఫోన్లో డబ్బు తేవాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రియాంకకు ఒక ఫోన్ కాల్ రాగా.. ఆమె ఇంట్లో పైఅంతస్తులోకి వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి ఆమె చలనం లేకుండా ఫ్లోర్పై పడి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. సీలింగ్కు చున్నీ వేలాడటాన్ని గమనించి హుటా హుటిన ఆస్పత్రికి రలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రియాంకను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆమె భర్త, నలుగురు కుటుంబ సభ్యులపై పాలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via