ఏపీలో సోమవారం మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వ్యాపారి రంగనాథను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Crime : ఏపీలో సోమవారం మద్యం దుకాణాల లాటరీ పండగ ముగిసింది. ఈ లాటరీలో మద్యం దుకాణాలను దక్కించుకున్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. కొందరు రాని వారు వచ్చిన వారితో సంధి కోసం ప్రయత్నిస్తుంటే..మరికొందరైతే లాటరీ వచ్చిన వారిని కిడ్నాప్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. తాజాగా అలాంటి ఘటనే శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగింది.
లాటరీ వచ్చిన ఆనందంతో..
పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా హిందూపూర్ డివిజన్ సంబంధించిన లాటరీలో చిలమత్తూరులోని 57వ నెంబర్ దుకాణాన్ని రంగనాథ అనే వ్యక్తి కి దక్కింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కాసేపటికే రంగనాథ కిడ్నాప్ అయ్యాడు.
మద్యం వ్యాపారి రంగనాథను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని స్థానికులు చెప్పారు. మద్యం వ్యాపారి కిడ్నాప్ వార్త జిల్లాలో తీవ్రకలకలం రేపింది. విషయం తెలుసుకున్న రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం గురించి ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యర్థులే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని స్థానికులుఅనుకుంటున్నారు.రంగనాథకు మద్యం షాపు దక్కడంతో పూర్తిగా తమకే ఇవ్వాలని లేదంటే, అందులో వాటా కోసం డిమాండ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రంగనాథ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సెల్ఫోన్ ద్వారా ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను, సెల్ఫోన్ సిగ్నల్ను పరిశీలిస్తున్నారు.
రంగనాథ కిడ్నాప్తో జిల్లాలో మద్యం లాటరీ దక్కిన ఇతర వ్యాపారులు అప్రమత్తమయ్యారు. తమను కూడా ఇలా కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందన్న భయంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలో మొత్తం 87 మద్యం షాపులకు 1074 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కలెక్టర్ చేతన 87 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అందులో మహిళలు 60 మంది ఉన్నారు. మద్యం షాపులకు ఎంపికైన వారు 48 గంటల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..