November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Online Betting: ‘దయచేసి ఎవరలా చేయకండి’.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్ లెటర్‌..

వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండం తంబళ్లపల్లె మండంల ఎద్దుల వారి పంచాయతీ దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి (27) బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు. మంచి జీతం, హ్యాపీగానే లైఫ్‌ సాగుతోంది. అయితే అప్పుడే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆ మాయలో పడి ఏకంగా..


సరదా కోసమో, అత్యాశకో మొదలై చివరికి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తోంది ఆన్‌లైన్‌ బెట్టింగ్‌. హ్యాపీగా ఉద్యోగాలు చేస్తూ రూ. లక్షల్లో జీతాలు వస్తున్న వారు కూడా బెట్టింట్ మహమ్మారికి బలి అవుతున్నారు. నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. అప్పులు ఊబిలో మునిగిపోయి, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక చివరికి ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మదనపల్లెలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండం తంబళ్లపల్లె మండంల ఎద్దుల వారి పంచాయతీ దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి (27) బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు. మంచి జీతం, హ్యాపీగానే లైఫ్‌ సాగుతోంది. అయితే అప్పుడే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆ మాయలో పడి ఏకంగా రూ. 24 లక్షలు పోగొట్టుకున్నాడు.

తెలిసిన వాళ్లందరికీ బాగా అప్పులు చేశాడు. పరిస్థితి చేయి దాటింది, అప్పుడు తిరిగి ఎలా చెల్లించాలో అర్థం కాలేదు. దీంతో తనువు చాలించాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మదనపల్లె మండలం సీటీఎం సమీపంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చేందుకు ఈ నెల 11న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరారు. అయితే అమ్మమ్మ ఇంటికి వెళ్లకుండా సీటీఎం సమీపంలోని రెడ్డివారిపల్లె వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 12న ఉదయం డెడ్‌ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్నారు.


మృతదేహం సమీపంలో ఉన్న ఆత్మహత్య లేఖ, ఐడీ కార్డు, ల్యాప్‌టాప్, ఫోన్‌ ఆధారంగా పద్మనాభరెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇక పద్మనాభరెడ్డి సూసైడ్‌లో పేర్కొన్న అంశాలు షాక్‌కి గురి చేస్తున్నాయి. ‘ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో దాదాపు రూ.24 లక్షలు పోగొట్టుకున్నాను. దయచేసి ఎవరూ బెట్టింగ్‌ జోలికి వెళ్లకండి. అది చాలా ప్రమాదకరం. బెట్టింగ్‌ మాఫియా వాళ్ల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పినా పోలీసులు ఏమీ చేయలేరు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నా చావుకు నేనే కారణం గుడ్‌బై’ అని రాసుకొచ్చాడు. దీంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది.

Also read

Related posts

Share via