April 19, 2025
SGSTV NEWS
CrimeNational

పూజారిని మింగేసిన హారతి..! ఆలయంలో పేలిన సిలిండర్‌..ఆ భయానక దృశ్యాలు వైరల్‌



ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజీలో రికార్డయ్యాయి. పూజారి వెలిగించిన దీపంతో నడుచుకుంటూ వెళ్లి, మూసిన ఆలయం ద్వారాలు తెరిచారు. తలుపు తెరిచిన వెంటనే అతని చేతిలోని హారతికి,


కేరళలోని తిరువనంతపురం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కిలిమనూర్‌లోని ఓ ఆలయంలో గ్యా్‌స్‌ సిలిండర్‌ పేలడంతో పూజరి మృతిచెందాడు. అక్టోబర్ 11న ఘోర ప్రమాదం జరిగింది. కిలిమనూరు ఆలయంలో జయకుమార్ నంబూతిరి అనే పూజారి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆలయంలోకి వెళ్లగానే గ్యాస్ సిలిండర్ పేలి మంటల్లో చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు హుటా హుటిన మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన జయకుమార్‌ని సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ, ఫలిత లేకపోయింది. చికిత్స పొందుతూ పూజారి జయకుమార్‌ మృతి చెందాడు.


ఆలయంలోని సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడమే అగ్నిప్రమాదానికి కారణమని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజీలో రికార్డయ్యాయి. పూజారి వెలిగించిన దీపంతో నడుచుకుంటూ వెళ్లి, మూసిన ఆలయం ద్వారాలు తెరిచారు. తలుపు తెరిచిన వెంటనే అతని చేతిలోని హారతికి, అప్పటికే సిలిండర్ నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

మంటల్లో చిక్కుకున్న జయకుమార్ కాలుతున్న మంటలతో బయటకు పరుగులు తీశాడు. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతని శరీరం 80శాతం వరకు కాలిపోయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మరణించాడు.

మంటల్లో చిక్కుకున్న జయకుమార్ కాలుతున్న మంటలతో బయటకు పరుగులు తీశాడు. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతని శరీరం 80శాతం వరకు కాలిపోయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మరణించాడు.

Also read

Related posts

Share via