దేవీ నవరాత్రులతో పండుగ వాతావరణం సంతరించుకున్న విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విధుల నిర్వహణకు వెళ్తున్న రైలు లోకో పైలెట్‌పై గంజాయి బ్యాచ్ విచక్షణ రహితంగా దాడికి పాల్పడటంతో. అతను మృతి చెందాడు.
విజయవాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఆగడాలు శృతి మించిపోయాయి. రైల్వేస్టేషన్లో లోకోపైలట్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. విధులకు వెళ్తుండగా లోకో పైలట్ తలపై నిందితుడు రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఈ సంఘటనతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. తోటి లోకో పైలట్ హత్యకు గురవ్వడంపై రైల్వే లోకో పైలట్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. గతంలో చాలాసార్లు దాడి చేశారంటున్నారు రైల్వే సిబ్బంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ లేదని.. తరచూ గంజాయి బ్యాచ్ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని.. నిందితులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో నిందితుడు….
కాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుడివాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం నిందితుడు ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడిది బిహార్‌గా చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాత నిందితుడి క్రైమ్ హిస్టరీపై పూర్తి క్లారిటీ రానుంది.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




