అది తెనాలిలోని బుర్రి పాలెం రోడ్డు.. కొద్దీ రోజుల క్రితం తెల్లవారుజామునే వాకింగ్‌కు వెళ్లిన వాళ్లకి అక్కడ ఒక శవం కనిపించింది. కొంతమంది పోలీసులకు ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు కోటేశ్వరావుగా గుర్తించారు. కొద్దీ కాలం పోలీసు వాహనాలకు ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేశాడని అయితే గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ బౌన్సర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే కోటేశ్వరావు వంటిపై కత్తి గాట్లు ఉండటంతో అది హత్యగా భావించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలోని బుర్రి పాలెం రోడ్డు.. కొద్దీ రోజుల క్రితం తెల్లవారుజామునే వాకింగ్ కు వెళ్లిన వాళ్లకి అక్కడ ఒక శవం కనిపించింది. కొంతమంది పోలీసులకు ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు కోటేశ్వరావుగా గుర్తించారు. కొద్దీ కాలం పోలీసు వాహనాలకు ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేశాడని అయితే గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ బౌన్సర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే కోటేశ్వరావు వంటిపై కత్తి గాట్లు ఉండటంతో అది హత్యగా భావించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అయితే హత్యకు ముందు రాత్రి కోటేశ్వరావు తన స్నేహితుడు ఆదాం షఫీతో ఉన్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు ఆదాం షఫీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే గతంలో వీరిద్దరూ మంచి స్నేహితులని అయితే హత్య చేయాల్సినంత గొడవలు ఇద్దరి మధ్య ఏమీ లేవని మొదట కుటుంబసభ్యులు భావించారు. అయితే పోలీస్ విచారణలో షఫీ విస్తుపోయే నిజాలు బయట పెట్టాడు.
కొద్దీ రోజుల క్రితం కోటేశ్వరావు వద్ద నుంచి షఫీ పదివేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న కోటేశ్వరావు తరుచూ ఫోన్ చేసి అప్పు తీర్చాలని అడిగేవాడు. దీంతో మనస్థాపానికి గురైన షఫీ కోటేవ్వరావుపై కక్ష పెంచుకున్నాడు. వెంటనే ఒక కత్తి కొనుగోలు చేశాడు. మద్యం సేవిద్దామని తెనాలి రావాల్సిందిగా కోటేశ్వరావుకు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో తెనాలి వచ్చిన కోటేశ్వరావు షఫీతో కలిసి బుర్రిపాలెం రోడ్డులో వారిద్దరూ కలిసి మద్యం సేవించే ప్రాంతానికి వెళ్లారు. పుల్గా మద్యం సేవించారు. ఈక్రమంలోనే కోటేశ్వరావు మరోసారి షఫీ వద్ద అప్పు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందుకోసమే ఎదురు చూస్తున్న షపీ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరావు వెంటనే చనిపోయాడు. తెల్లవారిన తర్వాతే కోటేశ్వరావు హత్య గురించి బయట పడింది. అయితే పోలీసులు విచారణలో షఫీ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో పూసగుచ్చినట్లు చెప్పాడు. దీంతో షఫీని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు
Also read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





