అత్తా కోడళ్ల పోరు అంటే.. మామూలుగా ఉండదు మరి.. ఇలాంటి కుటుంబ కలహాలు, వివాదాలు అన్నిచోట్ల కనిపించే వ్యవహారమే.. అయితే.. ఓ కోడలు మరో అడుగు ముందుకు వేసింది.. అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు అత్త చెవిని దారుణంగా కొరికేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు.. కొన్ని రోజులుగా కోడలు పావనికి అత్త నాగమణి (55) కి కుటుంబ కలహాల కారణంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పావని, నాగమణికి ఆదివారం రాత్రి గొడవ జరిగింది.
ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.. దీంతో కొడలు పావని క్షణికావేశంలో అత్త నాగమణి చెవిని కొరికింది.. దీంతో నాగమణి చెవి భాగం మొత్తం ఊడిపోయింది.
అనంతరం అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. స్థానికులు నాగమణిని తెగిన చెవితోపాటు తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే.. ఆలస్యం కావడంతో తెగిన చెవి అతుక్కోవడం కష్టమని వైద్యులు చెప్పారు. దీంతో చేసేదేం లేక అక్కడే చికిత్సను కొనసాగిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





