స్నేహితుడితో బయటకు వెళ్లిన యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పుణెలో చోటుచేసుకుంది.
పుణె: యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన యువతి గురువారం అర్థ రాత్రి తన స్నేహితుడితో బోల్దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది. వీరిని గమనించిన ముగ్గురు దుండగులు యువకుడిపై దాడిచేసి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడినుంచి పరారయ్యారు.
దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి ఆచూకీ కోసం 10 పోలీసు బృందాలను ఏర్పాటుచేశామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు శుక్రవారం ఉదయం పేర్కొన్నారు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో నిందితుల ఆచూకీ తెలుసుకోవడం కష్టతరంగా మారిందన్నారు. కాగా మరో ఘటనలో పుణెలోని ఇద్దరు ఆరేళ్ల బాలికలపై వ్యాన్ డ్రైవర్ సంజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లి తిరిగొస్తుండగా నిందితుడు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య