ఓ స్థల వివాదంలో ఇరువర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో జరిగింది.
మైలవరం : ఓ స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలోని చిన్నవెంతుర్ల గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న స్థలం విషయంలో సుమారు 30 ఏళ్లుగా ఇరువర్గాలకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఓ వర్గానికి చెందినవారు గొడ్డలి, రాళ్లతో మరో వర్గం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక వర్గానికి చెందిన తండ్రీకుమారులైన చంద్రశేఖర్ రెడ్డి, కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు