ఖమ్మం సమీపంలోని దానవాయిగూడెంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మొత్తం నలుగురు స్నేహితులు సోమవారం రాత్రి ఆటోలో ఆ కాలువ వద్దకు వచ్చారు.
ఖమ్మం ఖానాపురం హవేలి, : ఖమ్మం సమీపంలోనిదానవాయిగూడెంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మొత్తం నలుగురు స్నేహితులు సోమవారం రాత్రి ఆటోలో ఆ కాలువ వద్దకు వచ్చారు. వారిలో ఒకరు ఆటోలో నిద్రపోగా.. మిగిలినవారు కాలువ వద్దకు వెళ్లారు. వారిలో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన ఇద్దరూ ఏమయ్యారనేది తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని శివలింగాపురం గ్రామానికి చెందిన చల్లా రమేశ్, ప్రసాద్, బండారు భరత్ (30), రొండ వెంకటేశ్వర్లు ఖమ్మం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తమ స్నేహితుడు రామును చూసేందుకు సోమవారం ఆటోలో ఖమ్మం వచ్చారు. రాత్రికి దానవాయిగూడెంలో ఉన్న రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు వచ్చారు. కట్ట దిగువన ఆటోలో వెంకటేశ్వర్లు నిద్రపోగా.. మిగిలిన ముగ్గురు కాల్వ వద్దకు వెళ్లారు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన వెంకటేశ్వర్లు.. తన మిత్రులు కనిపించకపోవడం, కాల్వ వద్ద దుస్తులు, చెప్పులు ఉండడంతో.. బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు చేపట్టగా సాయంత్రానికి భరత్ మృతదేహం కొద్ది దూరంలో కాల్వలో బయట పడింది. మిగిలిన ఇద్దరు కాల్వలో గల్లంతయ్యారా.. ఇంకా ఎక్కడికైనా వెళ్లారా అనే అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై ఖానాపురం హవేలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం.
Also read
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!