December 17, 2024
SGSTV NEWS
Crime

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

పాచిపెంట: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ గిరిజన జంట ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. అయితే మద్యం మహమ్మారి ప్రవేశించి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. అప్పుడప్పుడు మద్యాన్ని తాగే భర్త ఆ సమయంలో భార్యతో గొడవపడేవాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ అవుతున్న నేపథ్యంలో భర్త తీరుపై మనస్తాపానికి గురైన ఓగిరిజన వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పాచిపెంట మండలంలోని పద్మాపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుంబి రాము శనివారం పూటుగా మద్యం తాగి భార్య జ్యోతితో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతి శనివారం అర్ధరాత్రి వంటింట్లో ఉరివేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భర్తకు మెలకువ వచ్చి వంటగదివైపు వెళ్తుండగా ఆత్మహత్యకు పాల్పడిన భార్యను చూసి వెంటనే స్థానికులకు తెలియజేశాడు. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. వారికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు.

Also read

Related posts

Share via