చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి (దసరా). అయితే హిందూ మతంలో దసరా పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఫెస్టివల్‌ను దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు. సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్ళిన రావణుడిని శ్రీరాముడు యుద్ధంలో ఓడించి సంహరించిన రోజునే విజయోత్సవంగా దసరా జరుపుకుంటారు.
దసరా పండుగ తేదీ ఎప్పుడు?
2024 సంవత్సరంలో శుక్ల పక్షం దశమి తిథి ఆకోబర్ 12న ఉదయం 10.58 గంటలకి ప్రారంభమై అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటలకు ముగుస్తుంది. అంటే అక్టోబర్ 12వ తేదీన విజయదశమి (దసరా)ను జరుపుకోనున్నారు.
దసరా ఎందుకు జరుపుకుంటారు?
శ్రీరాముడు రావణుడిని నరికి చంపినందుకు గాను దసరా పండగను జరుపుకొంటారు. అలాగే పురాణాల ప్రకారం.. మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత విజయ దశమి రోజున సంహరించిందని కూడా చెబుతుంటారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పశ్చిమబెంగాల్‌లో విజయదశమినిపెద్ద వేడుకగా నిర్వహిస్తారు. దసరా రోజున శమీ పూజ నిర్వహించి ఆ చెట్టు ఆకులను బంగారం ఇచ్చుపుచ్చుకుని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. దుర్గా పూజ పదో రోజున బెంగాలీలు బిజోయ దశమి పాటిస్తారు. ఈ పండగ రోజున దుర్గామాత ప్రతిమలని ఊరేగింపుగా తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేస్తారు. దసరా రోజున శమీ పూజ, అపరజిత పూజ, పాలపిట్ట చూడటం వంటివి శుభకరమైనవిగా భావిస్తారు