SGSTV NEWS
Andhra PradeshCrime

Chittor News: సినిమా సీన్ రిపీట్ – బురఖాలో లేడీస్ హాస్టల్‌కు యువకుడు, కట్ చేస్తే!


Crime News: తన ప్రియురాలిని కలిసేందుకు ఓ యువకుడు సినిమా స్టైల్‌లో ప్రయత్నించాడు. బురఖా వేసుకుని మారువేషంలో హాస్టల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా గమనించిన సిబ్బంది అతన్ని బంధించారు.

ప్రియురాలిని కలవడం కోసం హీరో గోడ దూకి పాట్లు పడడం, బురఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్‌లోకి చొరబడడం వంటివి మనం సినిమాల్లో చూసుంటాం. కానీ అలాంటి ఘటనే తాజాగా చిత్తూరు జిల్లాలో (Chittor District) చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు ఏకంగా బురఖా వేసుకుని లేడీస్ హాస్టల్‌లోకి చొరబడి చివరకు హాస్టల్ సిబ్బందికి దొరికిపోయాడు. పూర్తి వివరాల ప్రకారం.. కేరళలోని త్రిసూర్‌కు చెందిన యువతీ యువకుడు కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. సదరు యువకుడు బెంగుళూరులోని కుకింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యువతి చిత్తూరులోని గుడిపల్లి కాలేజీలో నర్సింగ్ సెకండియర్ చదువుతోంది. ఆమె కుప్పంలోని హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగిస్తోంది

ప్రియురాలిని కలవబోయి..

ఈ క్రమంలో తన ప్రియురాలిని కలిసేందుకు బెంగుళూరు నుంచి కుప్పం చేరుకున్నాడు. హాస్టల్‌లో కలిసేందుకు సినిమా స్టైల్‌లో మాస్టర్ ప్లాన్ వేశాడు. బురఖా ధరించి అమ్మాయిలా మారువేషంలో హాస్టల్‌లోకి వెళ్లాడు. అయితే, హాస్టల్ సిబ్బందికి అతని కదలికలపై అనుమానం వచ్చి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే యువకున్ని పట్టుకున్న కాలేజీ సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు. లేడీస్ హాస్టల్‌కు ఎందుకు వెళ్లావని పోలీసులు ప్రశ్నించగా.. తన ప్రియురాలిని కలిసేందుకే వెళ్లానని తెలిపాడు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, ఈ ఘటనపై మరో వాదన సైతం వినిపిస్తోంది. ప్రియురాలే యువకున్ని పిలిచిందని.. ఆమెతో కలిసి మారువేషంలో హాస్టల్‌లోకి వెళ్తుండగా ఆటో డ్రైవర్స్ గమనించి హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు సదరు విద్యార్థినిని సైతం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Also read

Related posts

Share this