ఉద్యోగం పేరుతో నిత్యం ఎందరో యువతను కేటుగాళ్లు నిండా ముంచుతున్నారు. ఉద్యోగం ఆశ చూపి లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. కాసులు చెల్లిస్తే చాలు నచ్చిన ఉద్యోగం చేతుల్లో పెడతామంటూ మాయమాటలు చెప్పి నిండా ముంచేస్తున్నారు. తాజాగా నిండా 18 యేళ్లు కూడా నిండని ఓ యువకుడు తాను రూ.2 లక్షలు చెల్లించి ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేశాడు. అంతేనా యూనీఫాం ధరించి, బైకేసుకుని రోడ్డెక్కాడు..
బీహార్, సెప్టెంబర్ 23: ఉద్యోగం పేరుతో నిత్యం ఎందరో యువతను కేటుగాళ్లు నిండా ముంచుతున్నారు. ఉద్యోగం ఆశ చూపి లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. కాసులు చెల్లిస్తే చాలు నచ్చిన ఉద్యోగం చేతుల్లో పెడతామంటూ మాయమాటలు చెప్పి నిండా ముంచేస్తున్నారు. తాజాగా నిండా 18 యేళ్లు కూడా నిండని ఓ యువకుడు తాను రూ.2 లక్షలు చెల్లించి ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేశాడు. అంతేనా యూనీఫాం ధరించి, బైకేసుకుని రోడ్డెక్కాడు. కనీసం మూతిమీద మీసాలు కూడా మొలవని కుర్రాడు ఐపీఎస్‌నని చెప్పుకోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు మోసం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని జాముయ్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
బీహార్‌లోని జాముయి జిల్లాకు చెందిన 18 ఏళ్ల మిత్లేష్ మాంఝీ అనే యువకుడు తన గ్రామంలో ఐపీఎస్‌నని చెప్పుకొని యూనీఫాం, పిస్టల్ ధరించి బైకులోపై చక్కర్లు కొట్టసాగాడు. తమనించిన స్థానికులు పోలీసులు చిన్నతనంలో పోలీస్ యూనీఫాం వేసుకుని ఆడలాడుకోవచ్చుగానీ.. పెద్దయ్యాక పోలీస్ యూనీఫాం వేసుకోకూడదని సర్దిచెప్పారు. కానీ మిత్లేష్ మాత్రం ఇది నిజం యూనీఫాం అని, తన వద్ద తుపాకీ కూడా ఉందని చెప్పాడు. యవ్వారం తేడాగా ఉండటంతో.. అప్రమత్తమైన పోలీసులు సదరు యువకుడిని సికింద్రా స్టేషన్‌కు తరలించింది విచారించారు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
నెల రోజుల క్రితం ఓ జలపాతం వద్దకు టూర్‌కు వెళ్లానని అక్కడ మనోజ్ సింగ్ అనే వ్యక్తికి తనకు రూ. రెండు లక్షలు ఇస్తే ఐపీఎస్ ఉద్యోగం ఇప్పిస్తానని, తనకు పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. ఇదంతా నిజమని నమ్మిన మిత్లేష్ బంధువులను పీడించి రూ.2 లక్షలు తీసుకొచ్చి మనోజ్‌సింగ్‌కు ఇచ్చాడు. దీంతో అతడు నీకు ఐపీఎస్ ఉద్యోగం వచ్చిందని చెప్పి, యూనిఫారంతో పాటు పిస్టల్ కూడా మిత్లేష్‌కు ఇచ్చాడు. దీంతో తాను ఐపీఎస్ అయ్యానని చెప్పుకుని ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో తిరగసాగాడు. నకిలీ ట్రైనీ ఐపీఎస్ అరెస్ట్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. అసలింత పెద్ద మోసం వెనుక ఏ ముఠా ఉందో తెలుసుకోవడానికి పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడి నుంచి పిస్టల్, యూనీఫాం, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Also read
- Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి…..
- AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
- Andhra Pradesh: ఆమె సాఫ్ట్వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్లో అసలు ఏం జరిగిందంటే..
- Telangana: మోజు తీరిన తరువాత అవౌడ్ చేశాడు.. పాపం ఆ యువతి.. వీడియో