November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: అందరూ దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీరు మాత్రం గుడి యెనక చేసే పనులివి

గుప్తనిధుల వేటగాళ్లు బరితెగించారు. ఏకంగా ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనే ఉన్న ఉపగుళ్లపై పంజా విసిరారు. గుప్తనిధుల కోసం గర్భగుడి పైకప్పు తొలగించి నిచ్చెన సహాయంతో లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లు గర్భగుడిలో తవ్వకాలు జరిపారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ తవ్వకాలు రామప్ప దేవాలయం పక్కనే ఉన్న గొల్లగుడిలో జరిగాయి. గర్భగుడి పైకప్పు తొలగించిన గుర్తు తెలియని దుండగులు నిచ్చెన సహాయంతో గర్భగుడిలోకి దిగిన ఆనవాళ్లు కనిపించాయి.

సహజంగా పురాతన దేవాలయాల్లో గర్భగుడిలో దేవుడు విగ్రహాల కింద నిధి ఉంటుందని ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పురాతన దేవాలయంలోకి దిగిన పైకప్పు నుండి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు గర్భగుడిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగిన విషయాన్ని స్థానికులు, పురావస్తుశాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రామప్ప పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఉప దేవాలయాలు తొమ్మిది ఉంటాయి. వాటి పట్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ఉపగుళ్లు గుప్తనిధుల వేటగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. గతంలో క్షుద్రపూజలు నిర్వహించి మరి తవ్వకాలు జరిపిన చరిత్ర కూడా ఉంది

Also read

Related posts

Share via