“నేను సీబీఐ అధికారిని, మీ అమ్మాయిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాం” అంటూ ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా కాల్ చేశాడు.. ఫోన్ కాల్ అందుకున్న వ్యక్తి పక్కనే కుమార్తె ఉండడంతో అప్రమత్తం అయ్యాడు. అతను సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా కాపాడుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం గ్రామానికి చెందిన గోవిందరావు ఫోన్‌కు వాట్సప్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తిన అతనికి ఓ వ్యక్తి సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, మీ కుమార్తె బ్యాగ్‌లో డ్రగ్స్ దొరకింది. ఆమెను అరెస్ట్ చేశామని తెలిపాడు. అయితే అదే సమయంలో కుమార్తె గోవిందరావు పక్కనే ఉండడంతో వచ్చిన ఫోన్ కాల్ ఎవరిదో ఇట్టే పసిగట్టాడు. సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తున్నారనే అనుమానం తో ఫోన్ కట్ చేసి, తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పడంతో ఫోన్ హ్యాక్ అయిందనే అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో అప్రమత్తమైన గోవిందరావు తన బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును మరో ఖాతాకు మళ్లించాడు. తరుచూ వార్తల్లో వినడం సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూడడం వల్లే తాను అప్రమత్తమయ్యానని గోవిందరావు తెలిపాడు. వెంటనే సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే కేటుగాళ్లు కాల్ కట్ చేశారు. సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పిస్తే ఇలాంటివి జరగవని ఆయన చెపుతున్నాడు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




