Jani Master Headed to Mumbai Jail: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతోందని అంతా చర్చించుకుంటున్నారు.
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో అతడి కోసం అన్వేషణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు గోవాలోని ఓ రిసార్ట్‌లో అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టాక.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. అయితే జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది. అతడ్ని ముంబై జైలుకు తీసుకెళ్తారని తెలుస్తోంది. దీనికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. అసలు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది రాయదుర్గంలో. అలాంటప్పుడు అతడ్ని హైదరాబాద్ జైలుకే తరలించాలి. కానీ ముంబై జైలుకు ఎందుకు పంపాలని అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
జానీ మాస్టర్ కేసులో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో FIR నమోదైంది. అక్కడి నుండి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆ పీఎస్‌లోనే కేసును రిజిస్టర్ చేశారు. అయితే.. బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం ముంబై హోటల్లో ఎఫెన్స్ జరిగింది. ప్లేస్ ఆఫ్ ది ఎఫెన్స్ లెక్క ప్రకారం అయితే.. జానీ మాస్టర్‌ను ముంబైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసు ప్రత్యేకం. ఎందుకంటే, పోక్సో చట్టం కేసు కింద ఫైల్ అయింది. బాధితురాలు ఉండేది ఇక్కడే కాబట్టి జానీ మాస్టర్‌ను ఇక్కడి జైలుకు పంపుతారా? ఒకవేళ ఇలా చేసినా ముంబైకి వెళ్లి సాక్ష్యాలు స్వీకరించాల్సి ఉంటుంది! టోటల్‌గా జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తరలిస్తారో చూడాల
Also read
- ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. పురాతన శ్మశానవాటికలో ఏం జరుగుతోంది?
- చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
- Hyderabad: డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్ రోడ్డులో బోల్తాపడిన కారు.. స్పాట్లోనే యువకుడు మృతి
- తెలంగాణ : గురూజీ అంటూ వచ్చారు.. గుండెలో గునపం దింపారు.. జోగిని వేశంలో శిష్యులుగా చేరి..
- తెలంగాణ : బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు..





