December 3, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

తనకంటే 10 ఏళ్ల చిన్నవాడితో మహిళ ఎఫైర్.. OYOలో ట్విస్ట్ ఇచ్చిన లవర్!




ఓ వివాహిత తనకంటే పదేళ్ల చిన్నవాడైనా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఊహించని దారుణం చోటు చేసుకుంది.



నేటి కాలంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఊభిలో చిక్కుకొని చాలామంది తమ జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మంచి కుటుంబం, చక్కగా సాగే సంసారం ఇలా అన్నీ బాగున్న సరే.. పరాయి సుఖాల కోసం కోరి కలతాలు తెచ్చుకుంటున్నారు. అవసరం లేని ఆనందాల కోసం ఆరాటపడి జీవితాలను సైతం బలి చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఓ మహిళ కూడా తన చేజేతులా నిండుజీవితాన్ని నాశనం చేసుకుంది. ఆ మహిళకు అందానికి అందం, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి. అయితే ఓ పాడు బుద్ది ఆమెను..తన కుటుంబం నుంచి దూరం చేయడమే కాదు, ఈ లోకం నుంచే దూరమయ్యేలా చేసింది.


ఓ వివాహిత తనకంటే పదేళ్ల చిన్నవాడైనా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాక అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ మహిళ తన ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఉన్న సొరవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగ్‌నగర్ మండలంలో చోటు చేసుకుంది. గోపాల్ భరి గ్రామంకు చెందిన సుమన్ దేవి సరాయ్ అనే (35) ఏళ్ల మహిళ తన కుటుంబంతో నివాసం ఉండేది. అయితే అకస్మాత్తుగా ఆదివారం సొరావ్ గ్రామంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఓయో రూమ్ లో హత్యకు గురైంది. అయితే సదరు మహిళను.. ఆమె ప్రియుడు వివేక్ దారుణంగా హత్య చేశాడు. ఇకపోతే మృతురాలు సుమన్ దేవి, నిందితుడు వివేక్ గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్ ఉన్నారు. ఈ క్రమంలోనే దేవి, వివేక్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం అతడికి కూడా చెప్పింది.

తొలుత పెళ్లి విషయంపై అతడు ఆసక్తి చూపించలేదు. అయినా సుమన్ దేవి..తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలోనే.. పెళ్లి గురించి మాట్లాడుదాం అంటూ బయటకి పిలిచాడు. దీంతో ఇద్దరు అనుకున్న దాని ప్రకారం.. ఆదివారం నాడు సొరావ్ గ్రామంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్ లో ఇద్దరు కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పెళ్లి విషయం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. అది కాస్త వివాదానికి దారి తీసింది.  దీంతో వివేక్ , దేవిను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఇక ప్రియుడి మాటలు విని షాక్ కు గురైన దేవి ఈ విషయం పై అతడితో వాగ్వాదం చేసింది. ఈ క్రమంలోనే.. తనను పెళ్లి చేసుకోకపోతే ఐదు లక్షల రూపాయాలు ఇవ్వాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. అయితే డబ్బులు ఇవ్వకపోతే, ఎక్కడ పోలీసులకు చెప్తుందోమనిన భయపడిన వివేక్.. ఆవేశంలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానే ఈ హత్య చేశానని పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. అలాగే తన ప్రియురాలి మృతదేహం ఓయో రూమ్ లో ఉందని కూడా పోలీసులకు సమాచారం అందించాడు.


ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సంఘటన స్థలానికి వెళ్లి పరీశిలించారు. అలాగే మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించి, మహిళ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతంర ఓయో హోటల్ మేనేజర్ ను, సిబ్బందిని పోలీసులు విచారించారు. ఇదిలా ఉంటే.. మృతురాలు గతంలో బల్కరన్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని పదేళ్ల క్రితం చేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో.. ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకన్నా పదేళ్ల చిన్నోడైనా వివిక్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. చివరకు అతడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. మరి..ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also read

Related posts

Share via