SGSTV NEWS
Spiritual

Pitru Paksha 2024 మహాలయ పక్షం అంటే ఏమిటి? ఈ కాలంలోనే శ్రాద్ధకర్మలు ఎందుకు నిర్వహిస్తారంటే…

Pitru Paksha 2024 తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షాలుగా పరిగణిస్తారు. ఈ కాలంలోనే పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు ఎందుకు నిర్వహిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Pitru Paksha 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజున చంద్ర గ్రహణం, భాద్రపద పౌర్ణమి కూడా వచ్చింది. ఇవి అక్టోబర్ 2వ తేదీన భాద్రపద అమావాస్య, సూర్య గ్రహణం వేళ ముగియనున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుట లోపల నిలబడి రెండు చేతులను జోడించి పితృ దేవతలను స్మరించుకోవాలి. ఇలా చేయడం కుటుంబంలో ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. ఇదిలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది.. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాల వల్ల కలిగే ప్రయోజనాలేంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…



మహాలయ పక్షం అంటే..

ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్లను ఎలా ఆరాధిస్తారో.. తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని, పితృ దేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి. వీరికి పితృ పక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృ దేవతల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి.. లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృ దేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.


మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే..
మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే..
మహాలయ పక్షాలు పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు.ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృ దేవతల ఆకలి తీరుతుందని చాలా మంది నమ్ముతారు. ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో.. వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి. వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్ద్యేశం..





కర్ణుడికి కష్టాలు..!
మహాభారతంలో కర్ణుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కర్ణుడిని గొప్ప దాన గుణం కలవాడిగా భావిస్తారు. ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది. అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేసింది. అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది. దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది. అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి. ఇక చేసేదేమీ లేక దగ్గర్లోని సెలయేరు దగ్గరకు వెళ్లి దప్పిక తీర్చుకుందామని వెళ్లాడు. అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది. ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది. తాను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది. ‘నీ చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేశావు. ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బూ రూపంలో చేశావు. ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు. అందుకే నీకు ఈ దుస్థితి’ అంటూ వివరించింది.




కర్ణుడు వచ్చిన పక్షం రోజులు..
దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరకు వెళ్లి తనను భూలోకానికి పంపించాలని వేడుకొన్నాడు. సూర్యుడి వినతి ేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు. ఆ వెంటనే భూమి మీదకు వచ్చిన కర్ణులు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి, పితృ, మాతృ దేవతలకు తర్పణాలు వదిలాడు. తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి. అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు. కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు. ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు.





Related posts

Share this