October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Crime news: బామ్మర్దిని చంపి ఆత్మహత్యగా నమ్మించి.. ఆస్తి కోసం ఇంత దారుణమా?

హైదరాబాద్: ఆస్తి కోసం ఓ వ్యక్తి తన బామ్మర్దిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులను కొన్ని రోజుల పాటు నమ్మించినా.. చివరికి అసలు విషయం బయటపడటంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. శనివారం గచ్చిబౌలిలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ కేసు వివరాలను వెల్లడించారు.

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ గచ్చిబౌలి జయభేరి కాలనీలో వసతి గృహం (హాస్టల్) ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆన్లైన్ గేమింగ్తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. గత ఆరు సంవత్సరాలుగా యశ్వంత్(25) అక్క, బావ దగ్గర  ఉండి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పులు తీరాలంటే తన మామ ఆస్తి కాజేయాలని, దానికి అడ్డుగా ఉన్న బామ్మర్దిని లేపేస్తే ఆస్తి మొత్తం తనకే వస్తుందని ప్రణాళిక రచించాడు. దానికి తగ్గట్టుగా తన స్నేహితుడు ఆనంద్కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చాడు.
ఆనంద్, వెంకటేష్తో కలిసి శ్రీకాంత్.. సెప్టెంబరు ఒకటో తేదీ అర్ధరాత్రి హాస్టల్ లోని యశ్వంత్ గదికి వెళ్లి చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించి కారులో ఏపీ సరిహద్దు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్సు లో నెల్లూరు తీసుకెళ్లారు.

యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, అక్కడే ఉంటే పోలీసు కేసు అయ్యి హాస్టల్ బిజినెస్ దెబ్బతింటుందని అత్తమామలు, భార్యకు అనుమానం రాకుండా నమ్మించాడు. అంత్యక్రియలు అయిన కొన్ని రోజులకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. హాస్టల్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనుమానం. మరింత బలపడి.. ఈనెల 10న యశ్వంత్ తండ్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శ్రీకాంత న్ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోదంతం బయటపడింది. శ్రీకాంత్తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.90వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన చున్నీ, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

Also read

Related posts

Share via