SGSTV NEWS
Spiritual

Vishwakarma Jayanti: విశ్వకర్మ పూజ ఎప్పుడూ సెప్టెంబర్ 17న మాత్రమే ఎందుకు చేస్తారు? శుభ సమయం, పూజా విధానం….

 

విశ్వకర్మ భగవానుడి జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుడు ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథిలో జన్మించాడని చెబుతారు. అయితే కొంతమంది విశ్వకర్మను పూజించడానికి భాద్రపద చివరి తేదీ ఉత్తమమని నమ్ముతారు. పుట్టిన తేదీ కాకుండా సూర్యుని సంచారాన్ని బట్టి విశ్వకర్మ పూజ నిర్ణయించబడుతుందని ఒక నమ్మకం ఉద్భవించింది.


హిందూ మతంలో విశ్వకర్మ గొప్ప వాస్తు శిల్పి, ఇంకా చెప్పాలంటే మొదటి ఇంజనీర్. ఆయన జన్మించిన తిధిని విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17వ తేదీన వచ్చింది. విశ్వకర్మ జయంతి రోజున పరిశ్రమలు, కర్మాగారాలు, అన్ని రకాల యంత్రాలకు పూజలు చేస్తారు. హిందూ మతంలో ఉపవాసాలు, పండుగల తేదీలలో ఎల్లప్పుడూ మార్పు ఉంటుంది. అయితే విశ్వకర్మ పూజ పండుగ ప్రతి సంవత్సరం ఒకే తేదీన జరుపుకుంటారు. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ పూజను జరుపుకోవడానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి.


సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజ ఎందుకు జరుపుకుంటారు?
విశ్వకర్మ భగవానుడి జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుడు ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథిలో జన్మించాడని చెబుతారు. అయితే కొంతమంది విశ్వకర్మను పూజించడానికి భాద్రపద చివరి తేదీ ఉత్తమమని నమ్ముతారు. పుట్టిన తేదీ కాకుండా సూర్యుని సంచారాన్ని బట్టి విశ్వకర్మ పూజ నిర్ణయించబడుతుందని ఒక నమ్మకం ఉద్భవించింది. తరువాత ఈ రోజును సూర్య సంక్రాంతిగా జరుపుకోవడం ప్రారంభించారు. ఇది దాదాపు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న వస్తుంది. అందుకే ఈ రోజున విశ్వకర్మ జయంతి గా పూజలు చేయడం ప్రారంభించారు.

విశ్వకర్మ పూజ శుభ సమయం
హిందూ వైదిక క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం విశ్వకర్మ పూజకు శుభ సమయం ఉదయం 6.07 నుండి 11.43 వరకు ఉంటుంది. శుభముహూర్తంలో పూజించడం వల్ల విశ్వకర్మ భగవంతుని విశేష ఆశీస్సులు లభిస్తాయి.

విశ్వకర్మ పూజ విధి
విశ్వకర్మ పూజ రోజున, ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా యంత్రాలను పూర్తిగా శుభ్రం చేయడం. ఈ రోజున వాహనాలను కూడా పూజిస్తారు. వాహనాలను పూర్తిగా శుభ్రం చేసి తర్వాత వాటిని పూజించాలి. విశ్వకర్మను పూజించడానికి ముందుగా పనిముట్లు , యంత్రాలతో పాటు పసుపు వస్త్రంపై విశ్వకర్మ విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. ఆ తర్వాత విశ్వకర్మ చిత్రం, సాధనాలకు పసుపు, కుంకుమ, గంధం దిద్దండి. పూలమాలతో అలంకరణ చేసిన తర్వాత ఐదు రకాల పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. దీని తరువాత విశ్వకర్మ భగవానుని కథను చదవండి. పూజ పూర్తి అయ్యాక కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. అయితే నైవేద్యంలో బూందీ, బూందీ లడ్డూలు చాలా ముఖ్యమైనవి.

Related posts

Share this