SGSTV NEWS online
Andhra Pradesh

ఏచూరి సీతారాం శర్మ కు విప్లవ జోహార్లు…*

*

అమరావతి:
గుంటూరులో *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ*
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మికంగా మరణం,ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందిన సందర్భంగా శ్రీధర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ వారు గతంలో పేదల పక్షాన దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలు పార్లమెంటు సాక్షిగా ఎండగట్టారని, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యలపై ప్రభుత్వాలకు పరిష్కార మార్గాలు అందజేసేవారని, అటువంటి నాయకుని మృతి భారతదేశం అభివృద్ధికి, రాజకీయాలకు తీరనిలోటని శ్రీధర్ తెలియజేశారు.
వారి మృతికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ.. వారి ఆత్మకు  ఆ భగవంతుడు సీతారాం ఏచూరికి మంచి సద్గతిని ప్రసాదించాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని విప్లవ జోహార్లు, లాల్ సలాం తెలియజేస్తున్నాం…

*సిరిపురపు శ్రీధర్ శర్మ* 
రాష్ట్ర అధ్యక్షుడు
*బ్రాహ్మణ చైతన్య వేదిక*

Also read

Related posts