కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు బర్రారాజ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఎల్పీజీ సిలిండర్ రైల్వే ట్రాక్ పైనే ఉంచినట్లు తేలింది. ఈ గ్యాస్ సిలెండర్ లో పెట్రోల్, అగ్గిపెట్టెలు, ఇతర సున్నితమైన వస్తువులతో కూడా నింపారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై దొరికిన ఎల్‌పీజీ సిలిండర్, పెట్రోల్ బాటిల్‌కు సంబంధించి ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. ఆర్పీఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేసు దర్యాప్తును ఐబీకి అప్పగించారు. రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాటిల్ కనిపించడం సాధారణ విషయం కాదని భావిస్తున్నారు. ఇది ఏదో పెద్ద కుట్ర అని అది స్పష్టంగా తెలియజేస్తోందని అంటున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా రైల్వే ట్రాక్‌పై సున్నితమైన వస్తువులను ఉంచి రైళ్లను బోల్తా కొట్టించే కుట్రలు భారీగా జరుగుతున్నాయి.
తాజాగా రైలు ప్రమాదాన్ని సృష్టించే ఘటన అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైల్వే మార్గంలో చోటు చేసుకుంది. ఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు బర్రారాజ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఎల్పీజీ సిలిండర్ రైల్వే ట్రాక్ పైనే ఉంచినట్లు తేలింది. ఈ గ్యాస్ సిలెండర్ లో పెట్రోల్, అగ్గిపెట్టెలు, ఇతర సున్నితమైన వస్తువులతో కూడా నింపారు.
22 నిమిషాల పాటు నిలిచిన రైలు
గ్యాస్ సిలిండర్ కి రైలు ఢీకొనడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం తర్వాత కాళింది ఎక్స్‌ప్రెస్ మాకే వద్ద దాదాపు 22 నిమిషాల పాటు నిలిచిపోయింది. అనంతరం ట్రాక్‌ను పరిశీలించి ఈ రైలును ముందుకు పంపారు. కొన్ని రోజుల క్రితం సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది, ఈ ప్రమాదంలో రైలులోని 22 బోగీలు బోల్తా పడ్డాయి. విషయం తీవ్రతను గమనించిన ఆర్పీఎఫ్ శనివారం అర్థరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారంపై ఐబీ విచారణ చేపట్టింది
లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో తప్పిన పెను ప్రమాదం
ఈ విషయంపై కాన్పూర్ డిఎం, పోలీస్ కమిషనర్‌తో పాటు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఢీకొనడంతో పాటు ఆ గ్యాస్ సిలిండర్ ట్రాక్‌పై చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ట్రాక్‌పై దాని గుర్తులు కనిపించాయి. కొంచెం దూరంలో పెట్రోల్ బాటిల్ కూడా దొరికింది. రైలు ప్రమాదం కుట్రకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.
కేంద్ర సంస్థల నుంచి విచారణకు అభ్యర్థన
ఈ చర్య సంఘ విద్రోహుల చర్యగా రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీని వెనుక భయాందోళనలు సృష్టించడమే వారి లక్ష్యం. గత కొన్ని నెలలుగా ఇలాంటి కుట్ర జరుగుతుండటం, నాలుగైదు కేసులు వెలుగులోకి రావడంతో తేలిగ్గా తీసుకోలేమని చెబుతున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు ప్రమాదాలపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేయడమే కాదు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలను అభ్యర్దిస్తున్నాయి.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!