ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా, విషయాన్ని తేలిగ్గా తీసుకున్న ఆటో డ్రైవర్ సరే అయితే వెళ్లు..పోలీసులకు చెప్పుకో అంటూ ఆమెను చెంపపై కొట్టాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
మహిళల భద్రతపై తీవ్రమైన ఆందోళన, అనేక ప్రశ్నలను లేవనెత్తే షాకింగ్ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓలా యాప్ ద్వారా ఓ మహిళ ఆటోను బుక్ చేయగా.. రైడ్‌ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ కోపంతో ఆమెను వెంబడించాడు. తీవ్ర ఆగ్రహంతో ఆ డ్రైవర్ ఆమెను వేధింపులకు గురి చేశాడు. నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడాతూ, ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనను వీడియో తీసేందుకు యువతి ప్రయత్నించగా, డ్రైవర్ ఆమెను బెదిరించి మొబైల్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు బెంగుళూరులో మహిళల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓలా యాప్ ద్వారా ఓ మహిళ ఆటోను బుక్ చేసుకుంది. అయితే, అనుకోకుండా ఆమె తన రైడ్‌ను రద్దు చేయడంతో ఆటో డ్రైవర్ కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో ఆమెను వెంబడించి, ఆమెపై వేధింపులకు, దాడికి పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీసిన బాధితురాలు వెంటనే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.
మరో ఆటోలో వెళ్తున్న యువతిని వెంబడించిన డ్రైవర్ వారిని అడ్డుకున్నాడు. ఆటోలో కూర్చున్న అమ్మాయితో ఆటో డ్రైవర్ పెద్ద గొంతుతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం వీడియోలో కనిపించింది. రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావ్.. ఆటోకి గ్యాస్ మీ నాన్న ఇస్తారా? అంటూ మండిపడ్డాడు. దాంతో ఆ అమ్మాయి అతడికి బదులిస్తూ..అనుకోని కారణాల వల్ల రైడ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ, పట్టించుకోని ఆటో డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోవటం చూసి భయపడిపోయింది. ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా, విషయాన్ని తేలిగ్గా తీసుకున్న ఆటో డ్రైవర్ సరే అయితే వెళ్లు..పోలీసులకు చెప్పుకో అంటూ ఆమెను చెంపపై కొట్టాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
తాజా వార్తలు చదవండి
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం