Vinayaka chavithi 2024: గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుండి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. ఈ రోజున చాలా మంది గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. నవరాత్రుల పాటు పూజలు నిర్వహించి అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
వినాయక చవితి ఎప్పుడు వచ్చింది?
Vinayaka chavithi 2024: ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి వీధిలో మండపం ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు.
ఈ పండుగ ప్రధానంగా మహారాష్ట్రలో విస్తృతంగా గుర్తింపు పొందింది. గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని చతుర్థి తిథి నుండి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. ఈ రోజున చాలా మంది గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను ఎప్పుడు జరుపుకుంటారో జ్యోతిష్యుని నుండి తెలుసుకుందాం.
గణేష్ చతుర్థి ఎప్పుడు?
పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 12:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 7, 2024 శనివారం మధ్యాహ్నం 2:05 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి 7వ తేదీ ఉండటంతో ఆరోజే వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈ కారణంగా గణేష్ చతుర్థి పవిత్ర పండుగ ఉదయకాళిక చతుర్థి తేదీన జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7 నాడు ఉపవాసం ఉండటం మంచిది. చవితి ఘడియలు ఉన్న 6 వ తేదీ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 7 మధ్యాహ్నం లోపు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించుకోవచ్చు.
గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటారు?
భాద్రపద మాసంలో వచ్చే గణేష్ చతుర్థి ప్రత్యేక ప్రాముఖ్యత గ్రంధాలలో ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం గణేశుడు ఈ రోజున జన్మించాడు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పదిరోజుల పాటు ఎంతో వైభవంగా పూజలు చేస్తారు.
ఈ గణపతి విగ్రహాలను పదవ రోజు అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. వివిధ పూజా కమిటీలు పూజను నిర్వహిస్తాయి. మండపాల వద్ద తొమ్మిది రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహిస్తూ కోలాహల వాతావరణం నెలకొంటుంది. అయితే పూజా ఆచారాలు చాలా మంది భక్తులు తమ ఇళ్లలో కూడా నిర్వహించుకుంటారు. విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం నిమజ్జనం చేస్తారు.
దృక్ పంచాంగ్ ప్రకారం గణేష్ చతుర్థి శుభ సమయం
గణేష్ చతుర్థి 2024 శుభ సమయం
చతుర్థి తేదీ ప్రారంభమవుతుంది – సెప్టెంబర్ 06, 2024 మధ్యాహ్నం 03:01 గంటలకు
చతుర్థి తేదీ ముగుస్తుంది – సెప్టెంబర్ 07, 2024 సాయంత్రం 05:37 గంటలకు
నిషేధించబడిన చంద్రుని దర్శన సమయం – 09:30 AM నుండి 08:45 PM వరకు
వ్యవధి – 11 గంటల 15 నిమిషాలు
ఒక రోజు ముందు నిషేధించబడిన చంద్రుని వీక్షణ సమయం – 03:01 PM నుండి 08:16 PM, సెప్టెంబర్ 06
వ్యవధి – 05 గంటల 15 నిమిషాలు
మధ్యాహ్న గణేష్ పూజ ముహూర్తం- 11:03 AM నుండి 01:34 PM వరకు
వ్యవధి – 02 గంటల 31 నిమిషాలు
గణేష్ నిమజ్జనం- మంగళవారం, సెప్టెంబర్ 17, 2024
తమ పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు. అందుకే విఘ్నాలు తొలగించే వినాయకుడు అని పిలుస్తారు. ఏదైనా పూజ కార్యక్రమం మొదలు పెడితే తొలి పూజ అందుకునేది వినాయకుడు. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.