ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీటి ఉదృకత పెరిగిపోవడంతో మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం ఊహించని దారుణం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా కుండపోత వర్షం దంచికొడుతుంది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వాగులు, నదులు, చెరువులు పొంగిపోవడం రహదారులన్ని జలమాయమైయ్యాయి. ముఖ్యంగా వరద ఉదృతికి పెరిగిపోవడంతో.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరిపోవడం ప‍్రజలు తీవ్ర అతలాకుతలం అవుతున్నారు. అదే విధంగా పలు ప్రాంతల్లో వరద నీరు ప్రభావంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని వరద ఉదృతికి ఓ తండ్రి, కూతురు కారుతో కారుతో సహా వాగులోకి కొట్టుకుపోయి మృతి చెందారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర వరద ఉధృతికి.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన మునావత్ మోతీలాల్ ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా. అశ్విని HYD శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కారులో కారు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆ తండ్రి కూతురు కారుతో సహా వాగులోకి కొట్టుకుపోయారు.
ఇకపోతే అయితే ఆకేరు వాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్విని మృత దేహం లభ్యమైంది. అంతేకాకుండా.. కారు ఆనవాళ్లు కూడా ఏటి ప్రవాహంలో కనిపిస్తున్నాయి. అయితే తండ్రి మోతిలాల్ ఆచూకి మాత్రం ప్రస్తుతానికి లభ్యంకాలేదు. ఇదిలా ఉంటే.. వారిద్దరు తాము ప్రమాదంలో ఉన్నామని చివరి సారి కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ముఖ్యమైన పని కోసం ఇలా నగరానికి బయలుదేరుతుండగా తండ్రి కూతురు మరణించడం పై ఆ కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. అంతేకాకుండా.. మంచి బంగారు భవిష్యత్తు కలిగిన ఒక యువ సైంటిస్ట్ అశ్విని ఇలా వరద రూపంలో మృత్యువు కాటేయడం పై స్థానికంగా అందర్నీ కంటతడి పెట్టించింది.
తాజా వార్తలు చదవండి
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..