*శనిగ్రహ జననం – 1
మందిరంలో నిశ్శబ్దం తాండ విస్తోంది. వైవస్వతుడూ , యముడూ,యమీ పడుకు న్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు.
సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పైట – ఆమె అందానికి కట్టిన పతాకంలా గాలిలో చలిస్తోంది. సూర్యుడు భార్యను సంతృప్తిగాచూస్తూ సమీపించి ,వెనుకవైపు దగ్గరగా నిలుచున్నాడు. సంజ్ఞ భుజాల మీద రెండు చేతుల్నీ వేశాడు.
ఎందుకో సంజ్ఞ ఉలిక్కిపడింది. ఏదో దెబ్బ తగిలినట్టు ప్రతిస్పందిస్తూ తటాలున దూరంగా జరిగి , సూర్యుడి వైపు తిరిగింది. ఆమె ముఖంలో చిరునవ్వే లేదు. చూపులు పక్కకు తిరిగాయి.
సంజ్ఞా… భయపడ్డావా ?సూర్యుడి కంఠంలో అనురాగం పలికింది. భయ పడుతున్నాను.అంది సంజ్ఞ.
ఏం జరిగింది ? ఎందుకు భయం ? ఎవర్ని చూసి , దేన్ని చూసి భయపడుతున్నావు , దేవీ ? సూర్యుడు ఆందోళనతో అడిగాడు. ధైర్యం చెపుతున్నట్టు ఆయన శరీరం ఆమె దగ్గరగా జరిగింది.
సంజ్ఞ కళ్ళకి చేతిని అడ్డం పెట్టు కుంటూ , దూరంగా జరిగింది. ఎవర్ని చూసి భయపడుతున్నానో చెప్పనా ?అంది మెల్లగా. చెప్పు ! వాడు ఎవడైనా సరే… నిన్ను భయ పెట్టినందుకు.. సూర్యుడు ఆవేశంతో చెప్పుకు పోతున్నాడు.
ముందు – వినండి ! సంజ్ఞ ఆయనను వారిస్తూ అంది. నేను భయపడుతోంది మిమ్మల్ని చూసే !సంజ్ఞా !సూర్యుడు ఆశ్చర్యంతో అరిచాడు.
ఔను ! మిమ్మల్ని చూడగానే నా శరీరం వణికిపోతోంది… సంజ్ఞా ! అంటూ సూర్యుడు ఆమె దగ్గరగా జరిగాడు.దయచేసి దూరంగా ఉండండి ! అంటూ సంజ్ఞ ఎడంగా జరిగింది. నివ్వెరపోయి చూస్తున్న భర్తతో ఇలాఅంది. నిజం చెప్తున్నాను. మన్నించండి ! మీ శరీరం వెదజల్లే కాంతినీ , వేడిమినీ భరించలేకుండా ఉన్నాను…
సూర్యుడు తాత్కాలికంగా మూగవాడైపోయాడు. నమ్మలేనట్టు సంజ్ఞ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.
సంజ్ఞ అరచేతిని కళ్ళకు అడ్డంగా ఉంచుకునే ఉంది. సంజ్ఞా ! పరిహాసానికా ఇది ! సూర్యుడు ఆశగా అడిగాడు. అపరాధం చేశానా ? నొప్పించానా ? ఇది… ఇది… ప్రణయ కోపమా , దేవీ ?
ప్రణయ కోపం కాదు, ప్రణయ శాపం ! సంజ్ఞ కంఠంలో ఆవేదన ధ్వనించింది. మన్నించండి ! నేను నిజమే చెప్తున్నాను. మీ శరీరం ప్రసరించే కళ్ళు చెదిరే కాంతినీ , మీ శరీరం వెదజల్లే చెమటలు పట్టించే వేడిమినీ భరించడం ఇక నా వల్ల కాదు…
సూర్యుడు దెబ్బతిన్నట్టు చూశాడు. అయితే ఇంతకాలం ఎలాభరించావు?
భరించాను… భరించకచేయగలిగింది ఏముంది ? అపార్థం చేసుకోకండి ! మీ సామీప్యంలో నేను… చిత్రహింస అనుభవిస్తున్నాను… దయచేసి దూరంగా జరగండి సంజ్ఞ తనే దూరంగా జరుగుతూ అంది.
ఆశ్చర్యం నుండి కోలుకున్న సూర్యుడు చిన్నగా నవ్వాడు. గతం మరిచావా , సంజ్ఞా ? నా వెచ్చదనం నీకు ఎంతో ఇష్టం అంటూ ఆనాడు…
అది ఆనాడు ! మన దేహాల ఐక్యత ప్రారంభమవుతున్న ప్రాథమిక క్షణాలు. ఆ ఆకర్షణ వేరు , ఆ ఆవేశం వేరు. ఉరకలెత్తే ఉత్సాహం మనలోని ఆధిక్యతలనూ , న్యూనతలనూ గుర్తించ నివ్వలేదు !
నీ ధోరణితో , అర్థం లేని భయంతో నన్ను – నీ పతిదేవుణ్ణి అస్పృశ్యుడు నీ చూస్తున్నావు సంజ్ఞా !
స్వామీ ! అలా అనకండి. నా కోసం… ఒక పని చేయండి… చేస్తారా ?
కోరుకో !
నా కోసం…మీ వెలుగునూ , వేడిమినీ తగ్గించుకోండి !అసంభవం ! సూర్యుడు వెంటనే అన్నాడు.
స్వామీ ! సంజ్ఞ ఆశ్చర్యంతో అంది. నేను మీ అర్ధాంగిని , ప్రేయసిని ! మీ మాటల్లో చెప్పాలంటే మీ సర్వస్వాన్ని. నా మాటల్లో చెప్పాలంటే – నా సర్వస్వాన్నీ మీ సర్వస్వంగా మార్చిన మీ ప్రణయ దాసిని ! సంజ్ఞ ఆవేశంగా అంది.
ఔను ! నువ్వు చెప్పినవన్నీ నాకు కూడా వర్తిస్తాయి సంజ్ఞా ! కానీ…నీ కోరిక తీర్చలేను. నా ప్రకాశాన్నీ , ప్రతాపాన్నీ తగ్గించడం అసాధ్యం !
స్వామీ !
ఔను సంజ్ఞ… నీ శరీరకాంతినీ , ఉష్ణాన్నీ నువ్వు మార్చుకోలేవు. నేను కూడా అంతే ! గతంలోలాగా ఆవేశాన్ని , ఆకర్షణనూ కవచాలుగా చేసుకుని , నువ్వు సర్దుకు పోవాల్సిందే ; భరించాల్సిందే !
సంజ్ఞ అయోమయంగా ,ఆందోళనగా చూసింది. స్వామీ…ఆలోచించు , సంజ్ఞా ! జన్మతో సంక్రమించిన శరీర ధర్మాన్ని గౌరవించాల్సిందే.
ఆలోచించు ! నిన్ను నువ్వు సిద్ధపరుచుకో ! భర్త దేహధర్మాన్ని భరించే శక్తిని కూడదీసుకొని , నువ్వే నన్ను సమీపించాలి సుమా ! అప్పటి దాకా నా ప్రతాపం , నా ప్రకాశం నీకు దూరంగానే ఉంటాయి !
ధైర్యం చెప్తున్నట్టు నవ్వుతూ , సూర్యుడు శయ్యా మందిరం లోంచి అవతలకి నడిచాడు.సంజ్ఞ బలహీనంగా కూర్చుంది.
స్వామీ…
సంజ్ఞ పిలుపు విని , సూర్యుడు వెనుదిరిగి ఆమె వైపు చూశాడు. నన్ను.. ఆలోచించమన్నారు. నన్ను… సన్నద్ధం చేసుకోమన్నారు. నేను… నేను.. మీ దగ్గరగా ఉంటూ మీకు దూరంగా ఉండలేను…
సంజ్ఞా… సూర్యుడి కంఠంలో ప్రేమావేశం పలికింది. నా పుట్టినింటికి వెళ్తాను. కొంత కాలం మీకు దూరంగా , దూరంగా ఉండి , నను నేను సిద్ధం చేసుకొని తిరిగి వస్తాను.అనుమతిస్తారా
సూర్యుడి ముఖం మీద చిరునవ్వు వెలిగింది. దూరంగా వెళ్ళి , నాకు దగ్గరయే నీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను సంజ్ఞా ! వెళ్ళిరా !
నేను తిరిగి వచ్చేదాకా వైవస్వతుడినీ , యముడినీ , యమినీ మీరే చూసుకోవాలి సంజ్ఞ అభ్యర్థిస్తూ అంది.
అలాగే సంజ్ఞా ! చూసుకుంటాను. నీ జన్మస్థల ప్రవాసం త్వరగా పూర్తి చేయ సుమా ! సూర్యుడు నవ్వాడు. సంజ్ఞ కూడా నవ్వింది…..