November 22, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఏ జాబ్ కావాలి.. హైదరాబాద్‌లో ఘరానా మాయగాళ్లు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి పేరుతో ఫోన్ లో మాట్లాడి విద్యాశాఖలో పోస్టింగ్‌లు, అమాయక ప్రజలకి డబుల్ బెడ్రమ్స్, ఫుడ్ కార్పొరేషన్‌లో జాబ్ లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డి తో పాటు మరో ఐదుగురు నిందితులను మల్కజ్‌గిరి ఎస్వోటీ, కీసర పోలీస్ లు అరెస్టు చేశారు. నిందితులంతా జాబ్‌లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురి నుంచి 98 నకిలీ డబుల్ బెడ్‌రూమ్స్ కేటాయింపు పత్రాలు, కీసర RDO స్టాంప్‌లు, లక్షా 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితుల్లో ఏడుగురు విద్యాశాఖ అధికారులు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారని.. సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతూ ముఠా సభ్యులు చాలా మందిని మోసం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.


తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు రాచకొండ CP సుధీర్ బాబు స్పష్టం చేశారు. దాదాపుగా 107 మంది నుంచి కోటి 4 లక్షల రూపాయలు ముఠా సభ్యులు వసూలు చేశారని తెలిపారు.

సురేందర్ రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2021 సంవత్సరంలో క్రికెట్ బెట్టింగ్ కేసులో నేరడ్ మెట్ పీస్‌లో సురేందర్ రెడ్డి A1 గా అరెస్ట్ అయ్యాడని తెలిపారు. నవంబర్ 2022 సంవత్సరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని తెలిపారు. దాదాపుగా 107 మంది నుండి ఒక కోటి 4 లక్షల రూపాయలు వసూలు చేశారని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 18.5 లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు

Also read

Related posts

Share via