కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బెంగాల్‌లో అభయ ఘటన మరవక ముందే తమిళనాడులోని కృష్ణగిరి అనే మరో మృగాడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో 13 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు శివరామన్ అనే ప్రబుద్దుడు. విషయం తెలుసుకున్న పోలీసులు శివరామన్‌ను అరెస్ట్ చేశారు.
బెంగాల్‌లో యువ డాక్టర్ అత్యాచార ఘటన మరవక ముందే తమిళనాట మరో అమానుషంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో శివరామన్ అనే వ్యక్తి ఫేక్ ఎన్‌సీసీ క్యాంప్ పెట్టి 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నామ్ తమిళర్ కట్చి అనే రాజకీయ పార్టీకి చెందిన శివరామన్ కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లాడు. స్కూళ్లో ఎన్‌సీసీ యూనిట్ లేనప్పటికీ.. అక్కడ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పాడు. శివరామన్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఆ స్కూల్ మేనేజ్‌మెంట్ క్యాంప్ పెట్టేందుకు అంగీకరించింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్యాంప్‌నక మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 17 మంది బాలికలు ఉన్నారు.
అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్ ఆడిటోరియం, అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. వాళ్లకు తోడుగా టీచర్లు లేకపోవడంతో శివరామన్ 8వ తరగతి చదవుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు. ఈవిషయాన్ని బాధితులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్ పరువుపోతుందని భావించిన ప్రిన్సిపల్.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శివరామన్, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు సహా మొత్తం 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. శివరామన్ నేరచరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నాయి. విద్యార్ధినులకు వైద్యపరీక్షలు నిర్వహించారు.
Also read
- దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
- నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..





