ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త ముందే అఘాయిత్యానికి ఒడిగట్టారు దుండగులు. భర్తతో కలిసి మద్యం సేవించిన కొందరు యువకులు.. ఆ తర్వాత అతన్ని కొట్టి బంధించి, అతని ముందే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఏలూరులో శుక్రవారం(ఆగస్ట్ 16) అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, అతని రెండో భార్య ఏలూరులోని రామకోటి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 15రోజుల క్రితం నగరానికి వచ్చిన ఈ జంట హోటల్లో కూలీ పని చేస్తున్నారు. అద్దె ఇళ్లు దొరక్కపోవడంతో రాత్రిళ్లు రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై విశ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వారికి ఏలూరు చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. శుక్రవారం(ఆగస్ట్ 16) అర్ధరాత్రి ముగ్గురు యువకులు, ఆ వ్యక్తితో కలిసి మద్యం తాగారు. ఆ పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేశారు. అనంతరం పక్కనే నిద్రిస్తున్న అతని భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ముఖంపై దాడి చేశారు. ఆమె భర్త కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో నిందితులు ముగ్గురూ పరారయ్యారు. ఇందుకు సంబంధించిన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లైంగిక దాడి ఘటనలో నిందితులు ముగ్గురిని ఏలూరు వన్ టౌన్ పోలీసులు శనివారం(ఆగస్ట్ 17) అరెస్టు చేశారు. చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్‌కుమార్ అలియాస్ నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





