త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఓ కూతురు కాబోయే భర్తతో కలిసి కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది. అనంతరం ఫోన్ చేసినా తన తల్లి స్పందించడం లేదని, వెళ్లి చూడాలని పోలీసులకు ఫోన్ చేసి చెప్పి.. తన గొయ్యి తానే తవ్వుకుంది. తీరా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు కథ వెలికితీశారు. దీంతో పోలీసులు మృతురాలి కుమార్తెతోపాటు ఆమెకు కాబోయే భర్త, వీరికి సహకరించిన మరో వ్యక్తిని..
న్యూఢిల్లీ, ఆగస్టు 18: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఓ కూతురు కాబోయే భర్తతో కలిసి కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది. అనంతరం ఫోన్ చేసినా తన తల్లి స్పందించడం లేదని, వెళ్లి చూడాలని పోలీసులకు ఫోన్ చేసి చెప్పి.. తన గొయ్యి తానే తవ్వుకుంది. తీరా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు కథ వెలికితీశారు. దీంతో పోలీసులు మృతురాలి కుమార్తెతోపాటు ఆమెకు కాబోయే భర్త, వీరికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఆగస్టు 17) ఈ దారుణ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..
రుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన మోనికా సోలంకి అనే మహిళ శుక్రవారం పోలీసులకు ఫోన్ చేసింది. నజాఫ్‌గఢ్ మెయిన్ మార్కెట్‌లోని బిల్డింగ్ నాల్గవ అంతస్తులో 58 ఏళ్ల తన తల్లి ఒంటరిగా నివసిస్తుందని, చాలా సేపట్నుంచి ఆమె తన ఫోన్ కాల్‌కు స్పందించడం లేదని చెప్పింది. వెంటనే అక్కడకు వెళ్లి చూడాలని పోలీసులను కోరింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా.. బెడ్‌రూమ్‌లో నేలపై సుమిత్ర మరణించి ఉండటం గమనించారు. సుమిత్ర నుదిటి, కన్ను, చేతుల మణికట్టుపై గాయాలు ఉండటం, నోటి నుంచి రక్తం కారడంతో.. ఆ మహిళను ఎవరో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గ్రహించారు. వెంటనే ఆ భవనంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు చెక్ చేయగా.. అసలు బండారం బయటపడింది. శుక్రవారం తెల్లవారుజామున 2.18 గంటల సమయంలో ఒక మహిళతో పాటు ఇద్దరు పురుషులు ఆ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు గమనించారు.
అయితే సదరు సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మహిళను మోనికాగా నిర్ధారించారు. ఆమె వెంట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో కాబోయే భర్త నవీన్ కుమార్, హర్యానాకు చెందిన యోగేష్ అతడి ఫ్రెండ్‌గా గుర్తించారు. ఆస్తి కోసమే మోనికా వారిద్దరి సహాయంతో తల్లిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం