పెద్దనాన్న, పెద్దమ్మ అన్ని అయ్యి పెంచారు నిఖితను. చిన్నప్పటి నుండి వాళ్ల దగ్గరే పెరిగింది. అయితే సెలవులొస్తే చాలు అమ్మమ్మ ఇంట్లో వాలిపోయేది ఆమె. అమ్మమ్మను ఓ ఫ్రెండ్ లా భావించేది. కానీ చివరకు
చాలా మంది నాన్న తరుఫు బంధువుల కన్నా.. అమ్మ తరుఫు బంధువులతో ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. సెలవులు వస్తే చాలు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. మనవడు, మనవరాలు రాగానే ఉబ్బితబ్బిబ్బు అయిపోయే అమ్మమ్మ.. వారు వచ్చారని ఊరు ఊరంతా తెలియజేసేలా ప్రేమ కురిపిస్తుంది. ఇక స్పెషల్ వంటకాలు చేసి కొసరి కొసరి వడ్డిస్తుంది. ప్రతి అరగంటకు, గంటకు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటుంది. ఇక అక్కడే ఉండే బంధువులు కూడా వీరిని స్పెషల్‌గా చూస్తుంటారు. అలాగే ఎలాంటి కల్మషం లేకుండా కలిసిపోతుంటారు. అందుకే చాలా మందికి అమ్మమ్మ అన్నా, అమ్మ తరుఫు బంధువులన్నా ఓ ఎఫెక్షన్. ఇదిగో ఈ ఫోటోలోని యువతికి కూడా అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం.. ఎంత ఇష్టమంటే.. తాను మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకునేంత.
పెద్దల మనస్పర్థల వల్ల.. తనకు స్నేహితురాలిగా మారిన అమ్మమ్మ మాట్లడం లేదని పీజీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన మార్పాటి మహేందర్‌రెడ్డి, భార్య సుమతి , కూతురు ప్రియదర్శిని ఉన్నారు. సుమతి చెల్లెలి కుమార్తె నిఖిత (22)ను కూడా చిన్నప్పటి నుంచి పెద్దనాన్న మహేందర్ రెడ్డే పెంచారు. చిన్నప్పటి నుండి నిఖితకు అమ్మమ్మ అంటే ఇష్టం. సెలవులొస్తే చాలు హుజూరాబాద్ మండలం కేంద్రంలో ఉంటున్న అమ్మమ్మ పారుపల్లి వెంకటమ్మ ఇంటికి వెళ్లేది. ఆమెతో అన్ని పంచుకునేది. ప్రస్తుతం నిఖిత కాకతీయ యూనివర్శిటీలో పీజీ చేస్తుంది. చదువుతో పాటు ఓ ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో మహేందర్ రెడ్డికి అత్త వెంకటమ్మతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వెంకటమ్మ భీమదేవర పల్లికి రావడం మానేసింది. అమ్మమ్మ ఇంటికి రాకపోవడంతో పాటు తనతో మాట్లాడటం మానేసిందని బాధపడేది నిఖిత. ఈ నెల 14న యూనివర్శిటీకి వెళ్లి పరీక్షలు రాసిన నిఖిత.. ఇంటికి వచ్చి అక్క ప్రియదర్శిని కుమారుడితో సరదాగా ఆడుకుంది. ఆ తర్వాత మెడపై ఉన్న తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. అయితే ఉదయం 9 గంటలైనా కిందకు రాకపోవడంతో.. అక్క ప్రియదర్శిని, తండ్రి మహేందర్ రెడ్డి.. వెళ్లి పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో ఆందోళన చెందిన మహేందర్ స్నేహితుల సాయంతో తలుపులు పగులకొట్టి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి మహేందర్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, అమ్మమ్మ తనతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే.. నిఖిత ఇలా చేసిందని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం