స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మిత్రులు కొందరైతే.. స్నేహం ముసుగులో నమ్మించి నట్టేట ముంచేవాళ్లు ఇంకొందరు.. కష్టసుఖాల్లో తోడుగా ఉంటుందని మూడుముళ్లు వేసి ఇంటికి తెచ్చుకున్న భార్య నయవంచన చేస్తే.. ఫ్రెండ్ బావుండాలి.. వాడు జీవితంలో పైకి రావాలి అని అన్ని తానై తోడుగా నిలిచి దారిచూపిస్తే… అవసరం తీరగానే ముఖం చాటేసి మిత్రద్రోహం తలపెడితే, మన చుట్టూ ఉన్నవాళ్లు బావుంటే మనం బావుంటామని భావించి అందరికీ మంచి చేస్తూ..అందరిలో మంచిచూస్తూ అందరూ మనవాళ్లే అనుకున్న వారంతా నమ్మక ద్రోహం చేస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితినిజీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా తన తండ్రికి అండగా ఉండమని కడదాకా తనతో నిలిచిన స్నేహితుడిని చివరి కోరిక కోరి అదృశ్యమయ్యాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన చెక్క రాజేష్ అనే యువకుడు తను చనిపోతున్నానని, తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని స్నేహితులతో చెప్పి సెల్ఫీ వీడియో మిత్రులకు పంపి అదృశ్యమయ్యాడు. వీడియోలో తన చివరి కోరికగా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. నా శవంపై పార్టీ జెండా కప్పి నా అంత్య క్రియలునిర్వహించండి అని కోరాడు. కొంతకాలంగా రాజేష్, భార్య పూర్ణిమ మధ్య విభేదాలు రావడంతో రాజేష్‌పై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో జీర్ణించుకోలేకపోయిన రాజేష్ తన చనిపోతున్నట్టుగా స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపించాడు. ఈ క్రమంలో స్నేహితులు అతనికోసం గాలించారు. మాచర్ల శివారు లింగాపురం కాలనీ నాగార్జునసాగర్ కుడి కాలువ వద్ద రాజేష్ ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. సోమవారం సాయంత్రం నుంచి రాజేష్ ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో కాల్వలో దూకఇ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్నేహితులు, బంధువులు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025