October 17, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ప్రజల ఆశయాలకు అనుకూలంగా పనిచేయడమే మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి ల
లక్ష్యం…..

మచిలీపట్నం
16/8/2024

ప్రజల ఆశయాలకు అనుకూలంగా పనిచేయడమే మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి ల
లక్ష్యం…..

నిరుపేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు….. ప్రముఖ వైద్యులు బి ధన్వంతరి ఆచార్య….



మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లబనేని బాలసౌరి లు మచిలీపట్నంలో శుక్రవారం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిర్వహణకు గాను ప్రముఖ వైద్యులు డాక్టర్ బి . ధన్వంతరి ఆచార్య లక్ష రూపాయలు విరాళం ఇచ్చి, ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు లక్ష రూపాయలు విరాళం ఇస్తానన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ బి ధన్వంతరి ఆచార్యను మంత్రి కొల్లు రవీంద్ర అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ…..

పేదల ఆకలి తీర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ లు పేద ప్రజల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మరలా ప్రారంభించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలు గ్రహించాలి అన్నారు.

గత పాలకులు స్వార్థం కోసం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేద ప్రజల పొట్ట కొట్టారు అన్నారు.

మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి లు ప్రతినిత్యం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు అన్నారు.

మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి లు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ కు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు క్రమం తప్పకుండా మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదగా అందజేయడం జరుగుతుంది అన్నారు.

మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి లకు ప్రజలు కూడా తమ సహాయ సహకారాలు అందజేయాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి కృష్ణా జిల్లా కన్వీనర్, పి. వి. ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via