రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు.. రాజస్థాన్ లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్ లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్జఢ్ లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్ కు పాకిస్థాన్ కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్ లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.
ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్ పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్ ను హనుమాన్ ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమానఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





