SGSTV NEWS
CrimeNational

Watch: అమ్మవారి ఉత్సవాల్లో అపశృతి.. నిప్పుల గుండంపై పడి బాలుడికి గాయాలు.. షాకింగ్‌ వీడియో వైరల్



సుమారు 100 మంది స్థానికులు అమ్మవారిని స్మరించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు నిప్పులు గుండంపైకి వెళ్లసాగారు.  ఈ క్రమంలో ఏడేళ్ల బాలుడు మోనిష్‌ వంతు వచ్చింది. నిప్పుల వేడికి ఆ పిల్లాడు భయపడి వెనకడుగు వేశాడు. దీంతో ఊరి పెద్దలు మరో వ్యక్తితో కలిసి ఆ బాలుడిని నిప్పుల గుండంపైకి పంపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాలుడు నిప్పులపై పడిపోయాడు.


తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద నిప్పుల గుండంపై నడిచే కార్యక్రమం నిర్వహించారు. నిప్పులపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడిపోయాడు. దీంతో బాలుడికి ఒంటి గాయాలయ్యాయి. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆరంబాక్కం సమీపంలో గల కట్టుకొల్లైమేడు గ్రామంలో మరియమ్మన్‌ ఆలయ ఉత్సవాలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.


ఉత్సవాల్లో భాగంగా గ్రామస్థులు నిప్పుల గుండంపై నడిచారు. సుమారు 100 మంది స్థానికులు అమ్మవారిని స్మరించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు నిప్పులు గుండంపైకి వెళ్లసాగారు.  ఈ క్రమంలో ఏడేళ్ల బాలుడు మోనిష్‌ వంతు వచ్చింది. నిప్పుల వేడికి ఆ పిల్లాడు భయపడి వెనకడుగు వేశాడు. దీంతో ఊరి పెద్దలు మరో వ్యక్తితో కలిసి ఆ బాలుడిని నిప్పుల గుండంపైకి పంపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాలుడు నిప్పులపై పడిపోయాడు.

ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఊరి జనం.. ఆ పిల్లాడిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆలయం వద్ద  జరిగిన ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది

https://x.com/AduriBhanu/status/1823760977466102173?t=nl7MHmaWdnJe13iTayIUog&s=19

Also read

Related posts

Share this