గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది.

మేడ్చల్: ఆదివారం అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. అప్పటివరకు నాన్న.. నాన్న అంటూ ఇద్దరు కూతుళ్లు పిలుస్తుంటే ఆ తండ్రి మురిసిపోయాడు. వాళ్ల కబుర్లు వింటూ అలసట లేకుండా పనిచేయసాగాడు. కానీ ఆ మాటలే తండ్రి, కూతుళ్లకు చివరి మాటలు అయ్యాయి. ఆ క్షణాలే జీవితంలో ఆఖరి గడియలు అయ్యాయి. ముగ్గురూ ఒకేసారి ప్రాణాలు విడిచారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగుచూసింది.
రైలు ఢీకొని రైల్వే లైన్‌మెన్, అతడి ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుడి పేరు చెందిన కృష్ణ. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందినవాడని తెలిసింది. ఇక పిల్లల పేర్లు వర్షిత, వరుణి. వీరిద్దరి రైల్వే ట్రాక్‌పై కూర్చోబెట్టి పనిచేస్తుండగా అదే ట్రాక్ మీదకు ట్రైన్ వచ్చింది. పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించి కృష్ణ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
వీడియో
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





