November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

లోకేశ్ తో క్షమాపణలు చెప్పించిన పోలీసులు – మారతారా?

రాజకీయాలు మారుతున్నాయి. కొంత సున్నితత్వాన్ని సంతరించుకొంటున్నాయి.

అవును. “సీఎం చంద్రబాబు మడకశిర రావడం సంతోషకరం. ప్రభుత్వ కార్యక్రమాన్ని బలవంతపు తరలింపు లేకుండా సాదాసీదాగా సభను నిర్వహించడం హర్షణీయం. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా భవిష్యత్తులో ఇదే తరహాలో కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయం” అంటూ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి స్పందించారు.

డ్వాక్రా సంఘాలకు చెప్పి జనాన్ని తరలించి చంద్రబాబును మెప్పించాలని హెచ్చరిస్తూ వెంటపడే పని మెప్మా సంఘాలకు, వాలంటీర్లకు లేదు. పార్టీ నాయకులకు వర్తమానం పంపి బుడ్డీలు, బిర్యానీలు ఇచ్చైనా సరే జనాన్ని తరలించాలి అని చెప్పే పని లేదు. చెట్లు కొట్టేయడాలు లేవు. జనం వస్తే సభ అయ్యే వరకు కదలకుండా.. కందకాలు త్రవ్వే జేసీబీలు లేవు.

ఇన్ని జరుగుతున్నా పోలీసులు ఇంకా జగన్ సిఎం అనుకొంటున్నారు. ఇంకా ప్రభుత్వం మారిన విషయం జీర్ణం చేసుకోలేకపోతున్నారో.. ఏమో. జగన్ సిఎం అయిన కొత్తలో ఆయన, అప్పటి ఆయన మంత్రులు, ఆయన ప్రజాప్రతినిధులు కూడా ఆరు నెలలు అయినా చంద్రబాబు సిఎం అంటూ అసెంబ్లీలో సంభోధిస్తూ.. నాలుక కరచుకొనేవారు.

కానీ సున్నితమైన మనసుతో ఆలోచించి నిన్న లోకేశ్, మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆప్రాంత సీపీఐ/సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల మన్నింపును కోరాడు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు. ఇలాంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రజాపక్షమై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాల ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరుతున్నా అని, ఆయన పదే పదే చెబుతున్నా కూడా.. అలవాటులో పొరబాటుగా పోలీసులు అదే పని చేస్తున్నారు.

మారుతున్న రాజకీయం మంచి పరిణామం. పోలీసులు కూడా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల పట్ల సహృదయ భావంతో కొంచం సున్నితంగా మెలగాలి. అతి చేస్తే.. కఠినంగా వుండడంలో తప్పులేదు. కుక్కరు విజిలు నుండి సౌండ్ రాకుండా మూసేస్తే.. పదకొండుతో పేలిపోయాడు జగన్. ప్రతిపక్ష హోదాతో కూడా గుర్తుపట్టకుండా.

ఎవరైనా మనుషులే.. సమస్యలు తీర్చడానికే ప్రభుత్వాలు/పాలకులు. సమస్యలు అంటే చంద్రబాబైనా.. లోకేశైనా.. పారిపోరు జగన్ లెక్కన. సమస్యను వదిలేసి పారిపోతే.. సమస్య అలాగే వుండిపోతుంది. ఏ సమస్యకైనా పరిష్కారం వుంటుంది అని సానుకూల మనసుతో ఆలోచించే సున్నిత హృదయలు. కాబట్టే కాపుల రిజర్వేషన్ పోరాటాన్ని అప్పట్లో గెలిపించారు. ఎమ్మార్పీఎస్ పోరాటాన్ని నిన్న రాజ్యాంగ ధర్మాసనం వద్ద పరీక్షలో గెలిపించారు. దశాబ్దాలు అయినా వెంటాడుతాయి సమస్యలు అనడానికి ఆ రెండూ ఉదాహరణలు.

దయచే మరోసారి నాయకులతో క్షమాపణలు చెప్పించకండి.

Also read :బీకేర్‌పుల్..! గంజాయి సేవించారా..? ఇక తప్పించుకోలేరు.. ఇట్టే దొరికిపోతారు..!

ఎయిర్ గన్‌తో కాల్పులు.. మహిళకు తీవ్ర గాయం! వైద్యురాలు అరెస్ట్!

భర్త ముందే దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..

AP News: గనుల శాఖ పూర్వ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై వేటు.. ఏసీబీ విచారణకు ఆదేశం

జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..!

Related posts

Share via