November 22, 2024
SGSTV NEWS
CrimeNational

ఇస్రో ఉద్యోగిగా పరిచయం.. అందంతో వలపు వల.. నమ్మించి లక్షల్లో ముంచి

అందంతో వలపు వల వేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లక్షల్లో ముంచి పరారవుతున్న ఓ కిలేడీని తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

Also read :ఫోన్‌లో డాక్టర్.. గర్భిణీకి నర్సులు ట్రీట్మెంట్! ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంతో !

పైన ఫొటోలో కనిపిస్తోన్న మహిళను చూశారా.. అందమే ఆమెకు ఆయుధం.. చూడటానికి ఎంతో పద్దతిగా కనిపిస్తుంది.. చక్కగా మాట్లాడుతుంది. ఆమె కట్టు, బొట్టు, పద్దతి చూసిన వారేవరైనా సరే.. ఎంతో మంచిది అని నమ్ముతారు. ఆమెకు కూడా కావాల్సింది అదే. అలా నమ్మించి.. మాయమటలు చెప్పి వలపు వల వేస్తుంది. పైగా ఆమె టార్గెట్‌ పోలీసు అధికారులు, బ్యాంక్‌ ఎంప్లాయిస్‌, జిమ్‌ ట్రైనర్లు. వారితో పరిచయం పెంచుకుని.. ఆ తర్వాత తీయని మాటలతో వారిపై వలపు వల వేస్తుంది. అత్యవసరం అని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. తిరిగి ఇవ్వమంటే మాత్రం చుక్కలు చూపిస్తుంది. గట్టిగా అడిగితే.. అత్యాచారం కేసు పెడతానంటూ తన అసలు రంగు బయటపెడుతుంది. ఇలా ఎందరో మగాళ్లను బాదేసిన ఈ మహిళను తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

Also read :వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన డబ్బంతా హాంఫట్.. చెక్ చేయగా

ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇస్రో ఉద్యోగిగా చెప్పుకుంటూ.. మోసం చేస్తోన్న మహిళ శ్రుతి చంద్రశేఖరన్‌ని తాజాగా మేల్పరంబ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక ఉడుపిలోని ఓ లాడ్జ్‌లో ఉండగా అరెస్ట్‌ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రుతి చంద్రశేఖరన్‌ వయసు 32 సంవత్సరాలు. ఈజీ మనీకి అలవాటు పడింది. అందుకోసం పోలీసులు అధికారులు, బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ని టార్గెట్‌ చేసుకుంటుంది. ఇస్రో ఉద్యోగి, సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను, బ్యాంక్‌ ఎంప్లాయి, ఐటీ అధికారి ఇలా రకరకాల పేర్లు చెప్పుకుని వారికి పరిచయం అవుతుంది. తర్వాత తన అందంతో వారిపై వల వేస్తుంది. పెళ్లి చేసుకుంటాను అని నమ్మిస్తుంది. ఆ తర్వత కల్లబొల్లి కబుర్లు చెప్పి.. వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే.. అత్యాచారం కేసు పెడతానని వారిని బెదిరిస్తుంది.

Also read :Hyderabad: దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా..

అయితే శ్రుతి ఆగడాల గురించి పోయినాచి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు శ్రుతి ఇన్‌స్టాలో పరిచయం అయ్యిందని.. అది కాస్త ముదిరి పెళ్లి కబుర్ల వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు శృతి కాల్‌ చేసి తన అత్తకు క్యాన్సర్‌ ఉందని.. ఆమె చికిత్స కోసం డబ్బులు అవసరం ఉన్నాయని.. సాయం చేయమని తనని కోరిందని చెప్పుకొచ్చాడు పోయినాచి. ఆమె మాటలు నమ్మి.. విడతల వారీగా లక్ష రూపాయలు, 8 గ్రాముల బంగారు చైన్‌ ఆమెకి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన డబ్బు తిరిగి ఇవ్వమంటే.. శ్రుతి అందుకు అంగీకరించలేదు. పైగా అతడు తనపై అత్యాచారం చేశాడని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.

Also read :Hyderabad: దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా..
మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. శ్రుతి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి కంప్లైంట్‌ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కర్ణాటక ఉడిపిలోని ఓ లాడ్జీలో ఉంటుందని తెలుసుకుని.. అక్కడకు వెళ్లి ఆమెను అరెస్ట్‌ చేశారు. గతంలో ఓ జిమ్‌ ట్రైనర్‌ కూడా శ్రుతి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇస్రోలో టెక్నికల్‌ అస్టిస్టెంట్‌గా పరిచయం చేసుకుని.. తనను మోసం చేసిందని చెప్పుకొచ్చాడు. పోలీసులు అదుపులో ఉన్న శ్రుతిని త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు

Also read :కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి! మన ప్రేమే వాళ్ళ పెట్టుబడి!

Related posts

Share via