రాష్ట్రంలో ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కర్నూలులోని ఐఐఐటీ విద్యార్థి శనివారం మధ్యాహ్నం హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన విద్యార్ధిని విజయనగరం జిల్లాకు చెందిన ఈసీఈ (ECE) మూడో సంవత్సరం విద్యార్థి సాయికార్తీక్‌గా గుర్తించారు..
Also read :Tirumala: తిరుమల నడకమార్గంలో భక్తుడిని కాటేసిన పాము.. భయంతో హడలెత్తిపోయిన భక్తులు
కర్నూల్, జులై 28 : రాష్ట్రంలో ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కర్నూలులోని ఐఐఐటీ విద్యార్థి శనివారం మధ్యాహ్నం హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన విద్యార్ధిని విజయనగరం జిల్లాకు చెందిన ఈసీఈ (ECE) మూడో సంవత్సరం విద్యార్థి సాయికార్తీక్‌గా గుర్తించారు. మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కుడమ గ్రామానికి చెందిన నల్ల సాయి కార్తీక్ నాయుడు (20) ట్రిపుల్‌ఐడీ కాలేజీలో మూడో సంవత్సరం ఈసీఈ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ హాస్టల్ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
Also read :కాలేజీలో ఇద్దరమ్మాయిల మధ్య వివాదం .. చివరికి ఆ రేంజ్ లో ఫైటింగ్
గమనించిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్ధి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.
Also read :మద్యం మత్తా.. మజాకా..! కిక్కు తలెకెక్కడంతో… అతను టవరెక్కాడు.. ఆ తర్వాత అసలు సినిమా..
సాయి కార్తిక్ గదిలో రెండు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. అయితే దానిపై నోట్ తేదీ లేదు. ఒంటరి తనం కారణంగా విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు విఫలమైనట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అయితే సూసైడ్ లేఖలో ఉపాధ్యాయులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రేమ వైఫల్యం వంటి ఇతర ఏ సమస్యల గురించి లేఖలో ప్రస్తావించలేదు. మూడు నెలల వేసవి సెలవుల తర్వాత సాయి కార్తీక్ ఇటీవల క్యాంపస్‌కు తిరిగి వచ్చాడు. అతను జూలై 22 నుంచి తరగతులకు హాజరవుతున్నట్లు కాలేజీ యాజమన్యం తెలిపింది
Also read :Dog Meat Controversy: ‘వ్యాపారి బరితెగింపు..’ మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే..