November 21, 2024
SGSTV NEWS
Spiritual

Mahadev Mandir: ఈ ఆలయంలో డబ్బులు, కానుకలు నిషేధం.. శివయ్యకు జలం సమర్పిస్తే చాలు..

ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించకూడదనే షరతుతో శివుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ విషయం తెలియజేసేందుకు ఈ ఆలయంలో డబ్బులు కానుకలుగా సమర్పించడం పూర్తిగా నిషిద్ధం అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది. భక్తులు నీరు మాత్రమే సమర్పించగలరు.

ఉత్తరాఖండ్‌ను కేవలం దేవతల భూమి అని పిలుస్తారు. ఇక్కడ అనేక అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు చెందిన అద్భుత కథలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందుకే ఇక్కడి ఆలయాలను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఈ అద్భుత దేవాలయాలలో.. భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవలనుకునే ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. అందమైన ప్రకృతితో పాటు రహస్యాలకు నెలవు ఈ ఆలయాలు.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?
ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని పచ్చని కొండల మధ్య రాజధాని డెహ్రాడూన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉంది. ఈ రహదారి నుంచి ముస్సోరీకి వెళ్ళవచ్చు. భారతదేశం అంతటా అనేక పురాణ కథలున్న శివాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఉన్న ఓ ఆలయం.. దీని ప్రత్యేకతతో.. ఇతర దేవాలయాల కంటే భిన్నంగా చేస్తుంది. ఈ శివాలయానికి శ్రావణ మాసంలో, శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

డబ్బులు కానుకలుగా అందించడం నిషేధం
ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించకూడదనే షరతుతో శివుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ విషయం తెలియజేసేందుకు ఈ ఆలయంలో డబ్బులు కానుకలుగా సమర్పించడం పూర్తిగా నిషిద్ధం అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది. భక్తులు శివలింగానికి నీరు మాత్రమే సమర్పించగలరు. ఈ దేవాలయం డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. దేశంలో ఎలాంటి విరాళాలను, కానుకలను స్వీకరించని ఆలయాల్లో ఇది ఒకటి

క్రిస్టల్ శివలింగం ప్రధాన ఆకర్షణ
శ్రీ ప్రకాశేశ్వర మహాదేవ ఆలయం ప్రధాన ఆకర్షణ ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం. ఇది అరుదైన రాళ్లు, స్ఫటికాలతో తయారు చేయబడింది. క్రిస్టల్ అనేది ఒక రకమైన మంచు రాయి. ఈ క్రిస్టల్ మిలియన్ల సంవత్సరాలు మంచు గడ్డడం వలన ఏర్పడుతుంది. ఇది మెరిస్తూ పారదర్శకంగా, కఠినమైన రూపాన్ని కలిగి ఉంటుంది.

త్రిశూల ప్రత్యేక వాస్తుశిల్పం
శ్రీ ప్రకాశేశ్వర మహాదేవ ఆలయం దాని ప్రత్యేక శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గోడలు ఎరుపు, నారింజ రంగులలో పెయింట్ చేయబడ్డాయి. మొత్తం ఆలయం పైభాగంలో 140-150 కంటే ఎక్కువ త్రిశూలాలు ఉన్నాయి. ఇవి ఆలయ అందాన్ని మరింత పెంచుతాయి.

ప్రసాదంగా టీ ఇచ్చే ఆలయం
ఈ ఆలయంలో భక్తులకు ప్రతిరోజూ జరిగే లంగర్ (భండారా) లో హల్వ, ఖీర్, శనగలు, పూరీలను ప్రసాదంగా ఇస్తారు. భక్తులకు టీని అందిస్తారు. ఆలయంలో టీ తాగిన భక్తులు తమ కప్పును తామే శుభ్రంగా కడగాల్సి ఉంటుంది.

Related posts

Share via