November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

దుష్ప్రచారం తట్టుకోలేక యువజంట ఆత్మహత్య.! కానీ అనుకోకుండా అనుకోని స్థితిలో..

పొరపాట్లు చేయడం మానవ సహజం. సరిదిద్దుకుని ముందుకు సాగిపోతే అంతా హ్యాపీ.. కానీ సమాజం సూటిపోటి మాటలతో కాకుల్లా తూట్లు పొడుస్తుంటే ఆ యువజంట తట్టుకోలేకపోయింది. కుటుంబం ఆదరించినా సమాజం పదే పదే వేలెత్తి చూపడంతో మనస్తాపానికి గురైన ఆ జంట తల ఎత్తుకోలేక తల్లడిల్లిపోయింది. చివరికి ప్రాణాలు తీసేసుకుంది. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు తమ ఆవేదన తెలియజేస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Also read :ఆ రాశి వారికి కొత్త బాధ్యతలు- ఆర్ధిక పరిస్థితి నార్మల్​గానే! – Daily Horoscope In Telugu
పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. పోతంగల్‌ మండలం హెగ్డోలికి చెందిన అనిల్‌, పోతంగల్‌కు చెందిన శైలజకు ఏడాది కిందట వివాహమైంది. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ సెల్ఫీ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు. ఆయన నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్‌ఫోన్‌ నంబరు పంపారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్‌ నంబరును ట్రాక్‌ చేయగా ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు.

Also read :శంషాబాద్‌లో వెలుగు చూసిన దారుణం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన బస్తీవాసులు..!

Crime News: మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై అత్యాచారం

పోలీస్‌ డాగ్‌ సాహసం.. వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి మహిళ ప్రాణాలు కాపాడింది..

Related posts

Share via