చెరువుల్లో చేపలు చూశాం కానీ రోడ్డు మీద జలచరాల సంచరాల హడావుడి ఎప్పుడైనా చూశారా? అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిందే. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జనం ఇప్పుడు చెరువుల్లో కాకుండా రోడ్ల మీదే వలలు వేసి చేపలు పట్టుకెళ్ళారు…
Also read :Krishna District: పశువు కంటే హీనం.. అందుకే తల్లి వీడ్ని కడతేర్చింది…
ఎస్, ఇప్పుడివే దృశ్యాలు సర్వత్రా హల్‌చల్ చేస్తున్నాయి. వలలతో రోడ్లపైకి వచ్చి చేపలు వేటాడుతోన్న దృశ్యాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కుర్రకారు హంగామా చూడండి.. ఎందుకుండదు. చేపల వేటకు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా పెద్ద పెద్ద చేపలు ఇంటి ముంగిట్లోకే వస్తున్నాయి. వందలు పోసి కొనుక్కునే పని లేకుంరడా చేపలు మీ వీధుల్లోకే వచ్చేస్తుంటే ఎంత సంబరమో కదూ..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఊర్లూ ఏర్లూ ఏకమవడమంటే ఇదేనేమో. ఏకంగా ఏరు ఊరి మీదకొచ్చి పడింది. ఇక అందులో ఉన్న చేపలు సైతం ఊళ్ళోకి, ఇళ్ళల్లోకి వచ్చి పడుతున్నాయి. ఇక నదుల దగ్గరికో, చెరువుల దగ్గరికో వెళ్ళాల్సిన పనిలేకుండా కుర్రకారు వీధుల్లో చేపల వేట మొదలెట్టారు. భారీ వర్షాలకు చుట్టూ ఉన్న చెరువులు నుండి రోడ్డుపైకి వస్తాయంటున్న స్థానికులు
వీడియో..
Also read :Krishna District: పశువు కంటే హీనం.. అందుకే తల్లి వీడ్ని కడతేర్చింది…