మార్టూరు రూరల్ : ఆర్ధిక ఇబ్బందులతో గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా మార్టూరు రూరల్ మండల పరిధిలోని వలపర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ అహ్మద్ భాషా, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వలపర్ల గ్రామంలో హై స్కూల్ కి వెళ్లే రోడ్డులో నివాసం ఉండే తన్నీరు అంకమ్మరావు భార్య సుజాత స్థానికంగా టైలరింగ్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడికి ఇటీవల ఆరోగ్యం బాగోలేక పోవడంతో కొంతమంది వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని కుమారుడికి వైద్యం చేయించింది.
Also read :భర్త కోసం వెయిట్ చేస్తోంది.. వచ్చేలోపే అంతా జరిగిపోయింది
ఈ క్రమంలో తీసుకున్న అప్పు చెల్లించమని వడ్డి వ్యాపారస్తులు సుజాత ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం కూడా అప్పు చెల్లించమని వడ్డీ వ్యాపారస్తులు అడగడంతో తీవ్ర ఆందోళన గురైన సుజాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ప్రక్కనే నివాసం ఉంటున్న సమీప బంధువులు జరిగిన ఘటనను గమనించి అపస్మారక స్థితిలో ఉన్న సుజాతను ముందుగా స్థానిక ఆర్ యంపి వైద్యుడు వద్ద చూపించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ అంబులెన్సు లో మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు
Also read Vijaysai Reddy: మదన్ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి