October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad : గుట్టు చప్పుడు కల్తీ వైన్ తయారీ.. పోలీసుల ఎంట్రీతో అడ్డంతిరిగిన కథ

గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేస్తూ విక్రయిస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. స్టేషన్లో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీనివాసరావు, స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ లు వివరాలు వెల్లడించారు. లాలాగూడ, విజయపురి కాలనీ కి చెందిన గేరాల్డింగ్ మిల్స్(54) గృహిణి. తన ఇంట్లో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రహస్యంగా ద్రాక్ష పండ్ల, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్, రెండు లీటర్ల బాటలలో నింపి విక్రయిస్తున్నారు. కొంతమంది ఆ వైన్ ను ఆర్డర్స్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆమె ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా 112 బాటిళ్లలో నింపిన 90లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్ పట్టుకున్నారు. వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న కాళీ బాటలను సైతం సీజ్ చేశామని ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మహిళ కల్తీ వైన్ తయారుచేసి అరెస్ట్ అయిందని పేర్కొన్నారు.

Also read దారుణం.. పెళ్లైన 5 నెలలకే భార్యను అతి కిరాతకంగా..హత్య

పుట్టినరోజు నాడే ముంచుకొచ్చిన మృత్యువు! పాపం ఈ అమ్మాయి!

Related posts

Share via